ETV Bharat / state

కడప కలెక్టరేట్ ఎదుట ఉపాధ్యాయుల ధర్నా

author img

By

Published : Dec 28, 2019, 12:09 PM IST

పాఠశాలల్లో అతిథి ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న ఉద్యోగులను తొలగిస్తూ... ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. ఈ చర్యను వ్యతిరేకిస్తూ... కడప కలెక్టరేట్ ఎదుట అతిథి ఉపాధ్యాయులు ధర్నా చేశారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల తాము రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ పాదయాత్ర సమయంలో తమకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు.

gust falcultay dharna in front of kadapa collectorate
ధర్నా చేస్తున్న అతిథి ఉపాధ్యాయులు

.

ధర్నా చేస్తున్న అతిథి ఉపాధ్యాయులు

ఇదీ చూడండి

రివ్యూ 2019: నరమేధం నుంచి నోబెల్​ శాంతి బహుమతి వరకు

Intro:ap_cdp_19_27_guest_teachers_dharna_avb_vo_ap10040
రిపోర్టర్: సుందర్, ఈ టీవీ కంట్రిబ్యూటర్, కడప.

యాంకర్:
ఆదర్శ పాఠశాలలో పనిచేస్తున్న అతిధి ఉపాధ్యాయులను తొలగించడంతో వారు కడప కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. చేతిలో ప్లకార్డులు పట్టుకుని న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. 2015 లో అప్పటి ప్రభుత్వం నిబంధనల ప్రకారం వారిని విధుల్లోకి తీసుకున్నారు. కానీ ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం అతిధి ఉపాధ్యాయులను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో దిక్కుతోచని స్థితిలో ఉపాధ్యాయులందరూ ఆందోళన బాట పట్టారు. జగనన్న పాదయాత్ర చేసినప్పుడు తమ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఏకంగా విధుల నుంచి తొలగించడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. కుటుంబాలతో రోడ్డున పడ్డామని న్యాయం చేయాలని కోరారు. లేదంటే ఆత్మహత్యలు తప్పవని అతిథి ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేశారు.
byte: మనోహర్, అతిథి ఉపాధ్యాయులు, కడప.
byte: జాకీర్, అతిథి ఉపాధ్యాయులు, కడప.
byte: సుహాసిని, అతిథి ఉపాధ్యాయురాలు, కడప.


Body:రోడ్డున పడ్డ అతిథి ఉపాధ్యాయులు


Conclusion:కడప
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.