ETV Bharat / state

పండగవేళ విషాదం.. పిల్లలపై తండ్రి గొడ్డలితో దాడి.. ఆ తర్వాత

author img

By

Published : Jan 14, 2023, 10:09 AM IST

FATHER ATTEMPT TO MURDER
FATHER ATTEMPT TO MURDER

FATHER ATTEMPT TO MURDER ON HIS BABIES: వారిది అందమైన కుటుంబం. పండగ వాతావరణంతో ఇళ్లంతా కళకళలాడుతుంది. ఏమైందో ఏమో తెలియదు కానీ ఒక్కసారిగా కుటుంబ పెద్ద పాము అవతారం ఎత్తాడు. పాము తన పిల్లలను ఎలా చంపుకుంటుందో అదే విధంగా ఆ తండ్రి గొడ్డిలితో తన బిడ్డలపై దాడి చేశాడు. తరువాత తాను ఆత్మహత్య చేసుకున్న ఘటన వైఎస్సార్ జిల్లాలో జరిగింది.

FATHER ATTEMPT TO MURDER ON HIS BABIES: రాష్ట్రవ్యాప్తంగా సంక్రాంతి పండగ వాతావరణం నెలకొంది. ప్రతీ ఇంటా సంతోషాలతో, చిన్నపిల్లల చిరునవ్వులతో ఆహ్లాదకరంగా ప్రతీ ఊరూవాడ మారిపోయింది. కానీ ఓ ఇంట్లో మాత్రం విషాదం నిండింది. వాళ్లందరూ నిన్నటి వరకూ పండగను జీవితంలో మరిచిపోని విధంగా జరుపుకోవాలనుకున్నారు. ఏమైందో తెలియదు.. రాత్రికి రాత్రే ఆ ఇంట్లో విషాదం నెలకొంది. కన్నబిడ్డలను కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే పిల్లలపై దాడికి పాల్పడ్డాడు. ఆపై తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.

గొడ్డలితో దాడి: వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు మండలం నక్కల దిన్నెలో దారుణం చోటు చేసుకుంది. కన్నతండ్రి పాములా ప్రవర్తించి తన చేతులతో పెంచిన బిడ్డలపై గొడ్డలితో దాడి చేసి వారి జీవితాన్ని భోగి మంటల్లో కలపాలనే ప్రయత్నం చేశాడు. కుమార్తె, కుమారుడు ప్రశాంతంగా నిద్రపోతున్నారు. ఉదయాన్నే లేచి తెచ్చుకున్న కొత్త దుస్తులు వేసుకుని పండుగ జరుపుకుందామనీ కలలు కన్నారు. కానీ తండ్రి నరసింహా రెడ్డి.. కుమారుడు రవితేజ రెడ్డి, కుమార్తె పావనిలపై నిద్రిస్తుండగా గొడ్డలితో దాడి చేసి వారి జీవితాలను కడతేర్చాలని చూశాడు. వారిపై దాడి చేయడంతో రక్తపు మడుగులో కొట్టుకుంటూ కేకలు వేశారు. స్థానికులంతా ఏమైందోనని ఆ ఇంటి వైపు పరుగులు తీశారు. ఇద్దరూ తీవ్ర గాయాలపాలై కేకలు వేస్తున్నారు. ఈ దుర్ఘటనను చూసిన వారందరూ నివ్వెరపోయారు. అప్రమత్తమైన స్థానికులు కర్నూలు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థతి విషమంగా ఉంది.

ఆత్మహత్య: దాడి చేసిన అనంతరం నరసింహా రెడ్డి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. నరసింహారెడ్డికి మతిస్థిమితం సరిగా ఉండదని అక్కడే ఉన్న స్థానికులు పోలీసులకు వివరించారు. పోలీసులు అనుమానాస్పద కేసుగా నమోదు చేసుకున్నారు. విచారణ చేసి దాడికి గల కారణాలను వెల్లడిస్తామన్నారు.

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.