ETV Bharat / state

వారితో ప్రాణహాని ఉంది.. ఎమ్మెల్సీపై వైకాపా వార్డు సభ్యురాలు తీవ్ర ఆరోపణలు!

author img

By

Published : Jan 15, 2022, 4:00 PM IST

Flexi Issue in Prodduturu : ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రమేశ్ యాదవ్​పై.. వైకాపా పదో వార్డు కౌన్సిలర్ గరిశపాటి లక్ష్మీదేవి తీవ్ర ఆరోపణలు చేశారు. ఫ్లెక్సీల వివాదంలో తనపై అక్రమంగా కేసు పెట్టించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఎమ్మెల్సీ రమేశ్.. నేర చరిత్ర గల వారని ఆరోపించారు.

Clashes Between  ysrcp leaders in prodduturu
Clashes Between ysrcp leaders in prodduturu

Flexi Issue in Prodduturu : కడప జిల్లా ప్రొద్దుటూరులో అధికార వైకాపాలో ఫ్లెక్సీ వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వర్గీయులు ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు. ఎమ్మెల్యే రమేశ్ యాదవ్​పై.. వైకాపా పదో వార్డు కౌన్సిలర్ గరిశపాటి లక్ష్మీదేవి ఆరోపణలు గుప్పించారు.

ఎమ్మెల్యే రమేశ్.. నేరచరిత్ర గల వారని అన్నారు. తన కుటుంబానికి హాని చేస్తాడనే అనుమానం వ్యక్తం చేశారు. ఫ్లెక్సీల వివాదంలో ఆయన అనుచరుడు రఘనాథ్​పై బ్లేడుతో గాయాలు చేసి.. ఆ కేసును తనపైకి నెట్టే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. రమేశ్ యాదవ్ నేర చరిత్ర గురించి ఆయన వర్గీయులు తెలుసుకోవాలని కోరారు.

ఎమ్మెల్సీ నుంచి నా కుటుంబానికి ప్రాణహాని ఉంది. నాపై హత్యాయత్నం కేసు పెట్టించాలని చూస్తున్నారు. రఘునాథ్‌కు బ్లేడుతో గాయాలు చేసి, నాపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎమ్మెల్సీ నేరచరిత్ర ఆయన అనుచరులు కూడా తెలుసుకోవాలి - లక్ష్మీదేవి, వైకాపా వార్డు సభ్యురాలు, ప్రొద్దుటూరు

ఇదీ చదవండి

NBK: దగ్గుబాటి ఇంట.. గుర్రమెక్కి సందడి చేసిన బాలయ్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.