ETV Bharat / state

Attack on Volunteer: రెండో భార్యకు డబ్బులు పడలేదని... వాలంటీర్​పై బంధువుల దాడి

author img

By

Published : Jun 24, 2021, 6:22 PM IST

Updated : Jun 24, 2021, 7:41 PM IST

కడప జిల్లా లింగాల మండలంలోని చిన్నకూడాల గ్రామంలో వాలంటీర్​పై దాడి జరిగింది. ఈ ఘటనలో వాలంటీర్ మహేంద్రకు గాయాలయ్యాయి. దాడి చేసిన వ్యక్తుల నుంచి తనకు, తమ కుటుంబసభ్యులకు ప్రాణహాని ఉందని బాధితుడు మహేంద్ర ఆవేదన వ్యక్తం చేశాడు.

attack on volunteer in kadapa district
కడప జిల్లాలో వాలంటీర్​పై దాడి

కడప జిల్లా లింగాల మండలం చిన్నకూడాల గ్రామానికి చెందిన రామ్మోహన్ అనే వ్యక్తికి... ఇద్దరు భార్యలు ఉన్నారు. వీరిలో ఒకరి ఖాతాలో వైఎస్సార్ చేయూత నగదు జమ అయింది. మరొకరి ఖాతాలో డబ్బులు జమ కాలేదు. ఆగ్రహించిన రామ్మోహన్... మరో ముగ్గురితో కలిసి వాలంటీర్ దిద్దెకుంట మహేంద్రపై దాడికి పాల్పడ్డారు.

కట్టెలు, రాళ్లతో కొట్టి తీవ్రంగా గాయపరిచారు. గాయాలపాలైన మహేంద్రను చికిత్స నిమిత్తం కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. దాడి చేసిన వ్యక్తుల నుంచి తనకు, తన కుటుంబసభ్యులకు ప్రాణహాని ఉందని బాధితుడు మహేంద్ర ఆందోళన వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:

రాష్ట్రంలో కొత్తగా 4,981 కరోనా కేసులు, 38 మరణాలు

Last Updated : Jun 24, 2021, 7:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.