ETV Bharat / state

బస్సును ఢీకొన్న ఆటో.. నూతన వధూవరులకు గాయాలు

author img

By

Published : Nov 22, 2019, 7:41 AM IST

కడప జిల్లా రాజంపేటలో ఊటుకూరు వద్ద బస్సును ఆటో ఢీకొన్న ఘటనలో నూతన వధూవరులకు గాయాలయ్యాయి. వీరితో పాటు మరో నలుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు ఆసుపత్రికి తరలించారు.

బస్సును ఢీ కొన్న ఆటో.. నూతన వధూవరులకు గాయాలు

రోడ్డు ప్రమాదంలో నూతన వధూ వరులకు గాయాలు

కడప జిల్లా రాజంపేట మండలం ఊటుకూరు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న బస్సును ఆటో ఢీకొనటంతో ఏడుగురు గాయపడ్డారు. ఈ ఘటనలో నూతన వధూవరులూ ఉన్నారు. క్షతగాత్రులను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. రాజంపేట మండలం ఆకేపాడు పెద్దూర్​ నుంచి ఓబులవారపల్లె మండలం బోటుకిందపల్లెకి సారె తీసుకెళ్తుండగా ఈ ఘటన జరిగింది. బస్సు డ్రైవర్​ ఒక్కసారిగా బ్రేక్​ వేయడం వల్లే ప్రమాదం జరిగిందని ఆటో డ్రైవర్​ మహబూబ్​బాషా తెలిపాడు.

ఇదీ చూడండి:

రూ.10 అడిగాడు... ఇవ్వనంటే దాడికి దిగాడు..!

Intro:Ap_cdp_47_21_Bussulo_ prayanikudu mruthi_Av_Ap10043
K.veerachari, 9948047582
కడప జిల్లా రాజంపేటలో ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు. కడప ఆర్టీసీ డిపో నుంచి రాజంపేటకు బయలుదేరిన బస్సులో రాజంపేట మండలం బ్రాహ్మణపల్లి చెందిన సిద్దయ్య ఎక్కాడు మార్గమధ్యంలో గుండెపోటు రావడంతో పక్కనున్న ప్రయాణికులు ద్వారా సమాచారం తెలుసుకున్న బస్సు కండక్టర్ టిఎం భాష 180 సిబ్బందికి ఫోన్ చేశారు. వాళ్ళు వచ్చి పరిశీలించి మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ మేరకు బస్సును రాజంపేట డిపోకి తీసుకొచ్చారు. బంధువులు వచ్చి సిద్దయ్య మృతదేహాన్ని తీసుకెళ్లారు.Body:ఆర్టీసీ బస్సులో గుండెపోటుతో ప్రయాణికుడు మృతిConclusion:కడప జిల్లా రాజంపేట
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.