ETV Bharat / state

Pawan Kalyan: ఈ నెల 20న నర్సాపురంలో పవన్ 'మత్స్యకార అభ్యున్నతి సభ'

author img

By

Published : Feb 4, 2022, 9:39 PM IST

Pawan kalyan
Pawan kalyan

Pawan kalyan 'Matsakara Abhyunnati Sabha' : పశ్చిమ గోదావరి జిల్లాలోని నర్సాపురంలో ఈ నెల 20న 'మత్స్యకార అభ్యున్నతి సభ' నిర్వహించాలని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ నిర్ణయించారని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. మత్స్యకారుల ఉపాధిని దెబ్బ తీసే విధంగా ఉన్న 217 జీవోపై గళమెత్తడానికి పవన్ కల్యాణ్ ఈ సభ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

Pawan kalyan 'Matsakara Abhyunnati Sabha' : ఈ నెల 20వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లాలోని నర్సాపురంలో 'మత్స్యకార అభ్యున్నతి సభ' నిర్వహించాలని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ నిర్ణయించారని జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. మత్స్యకారుల జీవన ప్రమాణాలు పెంపొందించడం, ఉపాధి భరోసా, మత్స్యకారుల డిమాండ్లు ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా మిగిలిపోయాయని మనోహర్ తెలిపారు. ప్రభుత్వంలోని పెద్దలకు వీటిపై దృష్టిపెట్టే సమయం, ఆలోచన రెండూ లేవన్నారు.

మత్స్యకారుల ఉపాధిని దెబ్బ తీసే విధంగా ఉన్న 217 జీవోపై గళమెత్తడానికి పవన్ కల్యాణ్ ఈ సభ నిర్వహించనున్నారని నాదెండ్ల మనోహర్ తెలిపారు. జనసేన పార్టీ మత్స్యకార వికాస విభాగం ఛైర్మన్ బొమ్మిడి నాయకర్ పర్యవేక్షణలో సభ సాగుతుందన్నారు. ఈ నెల 13వ తేదీ నుంచి ఉభయగోదావరి జిల్లాలకు చెందిన జనసేన నాయకులు, శ్రేణులు, వీర మహిళలు తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలలోని మత్స్యకార గ్రామాలలో 'మత్స్యకార అభ్యున్నతి యాత్ర' చేపడతారని మనోహర్ వెల్లడించారు. 13వ తేదీన తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ రూరల్ మండలంలోని సూర్యారావుపేట నుంచి ఈ యాత్ర ప్రారంభమవుతుందన్నారు. ఈ యాత్రను తాను ప్రారంభించి.. 13, 14 తేదీల్లో యాత్రలో పాల్గొంటానన్నారు. 20న నర్సాపురంలో పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ బహిరంగ సభ నిర్వహిస్తారన్నారు. యాత్రలో పార్టీ మత్స్యకార వికాస విభాగం క్షేత్ర స్థాయిలో మత్స్యకారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, సమస్యలను అధ్యయనం చేస్తుందన్నారు.

ఇదీ చదవండి

PAWAN KALYAN: పోలవరం పూర్తి చేయాలనే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి ఉందా?: పవన్‌ కల్యాణ్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.