ETV Bharat / state

Karumuri Presmeet: నష్టపోయిన ప్రతీ రైతును జగన్ ప్రభుత్వం ఆదుకుంటుంది: మంత్రి కారుమూరి

author img

By

Published : May 6, 2023, 2:22 PM IST

Minister Karumuri Presmeet on farmers: గతకొన్ని రోజులుగా కురుస్తున్న అకాల వర్షాల వల్ల నష్టపోయిన ప్రతి రైతును జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆదుకుంటుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పురపాలక సంఘ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

Minister Karumuri Presmeet on farmers
Minister Karumuri Presmeet on farmers

Minister Karumuri Presmeet on farmers: అకాల వర్షాలు వల్ల నష్టపోయిన ప్రతీ రైతును ఆదుకోవడానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పురపాలక సంఘ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ధాన్యం కొనుగోలు నిరంతరం కొనసాగుతుందని ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని మరింత వేగవంతం చేశామని మంత్రి వివరించారు. అమరావతి అవినీతిపై హైకోర్టు ఇచ్చిన స్టే ను సుప్రీంకోర్టు కొట్టేసిందని.. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్​లో 370 కోట్లు కేబుల్స్ స్కాంలో 275 కోట్లు అవినీతి విషయంలో అరెస్టు చేస్తారనే భయంతో చంద్రబాబు నాయుడు ప్రజల మధ్యలో తిరుగుతున్నారని చెప్పారు. రైతులు రాకపోయినా కార్యకర్తలను రాకపోయినా ప్రజల మధ్య ఉంటే అరెస్టు చేయరనే భావనతో తిరుగుతున్నారని చెప్పారు. రైతులకు ఇన్సూరెన్స్ ప్రీమియం ప్రభుత్వమే చెల్లించి అమలు చేస్తుందని మంత్రి కారుమూరి వివరించారు.

రైతులకు భారీగా నష్టం.. అకాల వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని పంటలకూ భారీగా నష్టం వాటిల్లింది. వర్షాల ధాటికి పంటలు, ధాన్యం రాశుల్ని ఆరబెట్టుకోవడం రైతులకు కష్టసాధ్యంగా మారింది. కాస్త తెరిపి వచ్చిందని ఎండబెట్టుకునేలోగా మళ్లీ కురుస్తున్న వర్షాలతో.. ధాన్యాన్ని తడి వీడటం లేదు. రాశుల్లోనే ధాన్యం మొలకలొచ్చి.. పనికిరాకుండా పోతోంది. పసుపు, మొక్కజొన్న, మిరప పంటలూ.. రైతుకు కన్నీళ్లే మిగులుస్తున్నాయి. ఉద్యాన పంటలైన మామిడి, అరటి పంటలూ భారీగా దెబ్బతిన్నాయి. మొత్తం18 జిల్లాల్లో భారీ వర్షాలకు అధిక నష్టం జరిగింది. సుమారు 4 నుంచి 5 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిని ఉంటాయని ప్రాథమికంగా అంచనా కట్టారు.

సీఎం ఆదేశాలు.. గతకొన్ని రోజులుగా కురుస్తున్న అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతుల గురించి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో ఆయన పలు కీలక విషయాలపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతుల.. ముఖాలలో చిరునవ్వులు కనిపించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రతి రైతుకు ఏదైనా ఇబ్బందులు గానీ, ఫిర్యాదులు గానీ ఉంటే వాటిని పరిష్కారించడానికి (నివేదించడం) కోసం ఒక టోల్‌ ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేయండి. ఆ టోల్ ఫ్రీ నెంబర్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదులను ఆరోజే పరిష్కరించేలా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలి. చివరగా ప్రతి రైతు ముఖంలో చిరునవ్వు కనపడేలా ప్రతి అధికారి చర్యలు తీసుకోవాలి'' అని ఆయన ఆదేశించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.