ETV Bharat / state

మధ్యాహ్న భోజనంలో బల్లి.. 90 పాఠశాలలకు సరఫరా

author img

By

Published : Dec 18, 2019, 10:36 PM IST

చిన్నారులకు అందజేసే ఆహారం విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దాదాపు ఏడు వేల మంది తినే భోజనంలో బల్లి ఉన్నా ఏమాత్రం చూసుకోకుండా పాఠశాలలకు తరలించారు. ఓ ప్రధానోపాధ్యాయుడు అన్ని పాఠశాలలకు సమాచారం ఇవ్వగా పెను ప్రమాదం తప్పింది.

lizard was spotted in mid day meals lunch
ఆహారంలో విషం

మధ్యాహ్న భోజనంలో బల్లి.... చిన్నారులకు తప్పిన ముప్పు

పశ్చిమ గోదావరి జిల్లాలో ఏడు వేల మంది విద్యార్థులకు తృటిలో ప్రమాదం తప్పింది. ముప్పును గుర్తించిన పాఠశాల ఉపాధ్యాయులు స్పందించగా 90 పాఠశాలల్లో విద్యార్థులు ఆహారాన్ని తినకుండా ఆపగలిగారు. దేవరపల్లి మండలం ఎర్నగూడెం వద్ద ఉన్న ఏక్తా శక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో దేవరపల్లి, నల్లజర్ల మండలాల్లోని 90 పాఠశాలలకు మధ్యాహ్న భోజనం సరఫరా అవుతుంది. యథావిధిగా ఇవాళ కూడా అన్ని స్కూళ్లకు భోజనాన్ని చేరవేశారు.

దేవరపల్లి మండలం గౌరీపట్నంలోని ఎంపీపీ పాఠశాలలో విద్యార్థులకు భోజనం వడ్డించేందుకు సిద్ధమవుతుండగా పప్పులో బల్లి కనిపించింది. విషయం తెలుసుకున్న పాఠశాల ప్రధానోపాధ్యాయుడు... మిగిలిన పాఠశాలలకు సమాచారం అందించారు. 90 పాఠశాలల్లో విద్యార్థులకు భోజనం వడ్డించలేదు. ఆ ఆహారం తిని ఉంటే విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యేవారని ఉపాధ్యాయులు చెప్పారు.

కొంత కాలం నుంచి ఏక్తాశక్తి ఫౌండేషన్ సరఫరా చేస్తున్న భోజనంలో నాణ్యత ఉండడం లేదని ఉపాధ్యాయులు ఆందోళనకు దిగారు. వెంటనే సంఘటనపై చర్య తీసుకోవాలని, మధ్యాహ్న భోజన పథకం నుంచి ఆ సంస్థను తొలగించాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:

రాజధానిపై సీఎం యూటర్న్: లోకేశ్

Intro:AP_TPG_24-18_MID_DAY_MEALS_BALLI_AVB_AP10088
పశ్చిమగోదావరి జిల్లాలో ఏడు వేల మంది విద్యార్థులకు తృటిలో ప్రమాదం తప్పింది. పాఠశాల ఉపాధ్యాయులు స్పందించడంతో 90 పాఠశాలలో విద్యార్థులు ఆహారాన్ని తినకుండా పట్టుకోగలిగారు. దేవరపల్లి మండలం ఎర్నగూడెం వద్ద ఏక్తా శక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో దేవరపల్లి, నల్లజర్ల మండలాల్లోని 90 పాఠశాలలకు మధ్యాహ్న భోజన పథకం సరఫరా జరుగుతుంది. అయితే ఈ రోజు మధ్యాహ్నం యధావిధిగా అన్ని స్కూళ్లకు భోజనాన్ని చేరవేశారు. దేవరపల్లి మండలం గౌరీపట్నం లోని ఎంపిపి పాఠశాలలో విద్యార్థులకు భోజనం వడ్డించేందుకు సిద్ధమవుతుండగా పప్పులో బల్లి కనిపించడంతో ఒక్కసారిగా నిశ్చేష్టులయ్యారు. వెంటనే పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారికి ఈ విషయం తెలియడంతో ఆమె ద్వారా మిగిలిన పాఠశాలకు సమాచారం అందించడంతో విద్యార్థులకు భోజనం వడ్డించే లేదు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఆ విషాహారం తిని ఉంటే విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారని ఉపాధ్యాయులు తెలియ జేస్తున్నారు. గత కొంత కాలం నుండి ఏక్తాశక్తి ఫౌండేషన్ వారు సరఫరా చేస్తున్న భోజనం నాణ్యత ఉండడంలేదని పలుమార్లు చెప్పినా వారు తీరు మార్చుకోవడం లేదు అని ఉపాధ్యాయులు ఆందోళనకు దిగారు. వెంటనే సంఘటన పై చర్య తీసుకోవాలని మధ్యాహ్న భోజన పథకం నుండి ఆ సంస్థను తొలగించాలని డిమాండ్ చేశారు
బైట్స్: విద్యార్థులు తల్లిదండ్రులుBody:మిడ్ డే మీల్స్ బల్లిConclusion:గణేష్ జంగారెడ్డిగూడెం 9494340456
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.