ETV Bharat / state

ఉగాది ఉత్సవాలు: 1,116 బుట్టల తులసితో కోటి దళార్చన

author img

By

Published : Apr 13, 2021, 8:03 PM IST

ఉగాది సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కోటి తులసి దళార్చన సేవా కైంకర్యము ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి విజయవాడ శ్రీ గోవింద నామ ప్రచార సేవా సంఘం ఆధ్వర్యంలో 1,116 బుట్టల్లో తులసీ దళాలను సిద్ధం చేశారు.

ఉగాది ఉత్సవాలు : ద్వారకా తిరుమలలో ఘనంగా కోటి తులసి దళార్చన
ఉగాది ఉత్సవాలు : ద్వారకా తిరుమలలో ఘనంగా కోటి తులసి దళార్చన

ప.గో. జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో శ్రీ ప్లవ నామ ఉగాది ఉత్సవాలు ఘనంగా జరిపారు. ఉత్సవాల సందర్భంగా ఆలయాన్ని మామిడి తోరణాలు, పూలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు.

కోటి దళార్చన..

ఉదయం స్వామివారి ఉత్సవమూర్తులకు కోటి తులసి దళార్చన నిర్వహించారు. ఇందుకోసం విజయవాడ శ్రీ గోవింద నామ ప్రచార సేవా సంఘం ఆధ్వర్యంలో 1,116 బుట్టల్లో తులసీ దళాలను సిద్ధం చేశారు. స్వామి వారి మెట్ల మార్గం గుండా భక్తులు వాటిని తీసుకువచ్చి ఆలయ ముఖ మండపంలో కోటి తులసీ దళార్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

గోవింద నామాలు..

దక్షిణ గాలి గోపురం వైపు మెట్ల మార్గంలో ప్రత్యేకంగా గోవింద నామాలతో పూలను అలంకరించారు. మెట్ల మార్గంలోనే పూల అలంకరణ భక్తులను ఆకట్టుకున్నాయి. సాయంత్రం 7 గంటలకు ఆలయం లోపల వాయువ్య మండపంలో శేష వాహనంపై స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఉంచి, ప్రత్యేకంగా అలంకరించి పంచాంగం శ్రవణం నిర్వహించనున్నారు.

ఇవీ చూడండి : కొనసాగుతున్న కొవిడ్ కల్లోలం: కొత్తగా 4,228 కేసులు.. 10 మరణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.