ETV Bharat / state

ఏం కష్టమొచ్చిందో... కాలువ వంతెనపైనే మహిళ నివాసం

author img

By

Published : Aug 10, 2020, 9:30 PM IST

పశ్చిమగోదావరి జిల్లా పోలవరానికి చెందిన ఓ మహిళ.. గుంటూరు జిల్లా పెదకొండూరు సమీపంలోని రేపల్లె కాలువ వద్ద గత 20 రోజులుగా ఉంటోంది. కాలువ వంతెనపై బరకం వేసుకుని నివశిస్తోంది. గ్రామస్థులు ఊరిలోకి రమ్మని పిలిచినా వెళ్లేందుకు నిరాకరిస్తోంది. పోలవరం నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చావని ప్రశ్నించిన సమాధానం ఇవ్వడంలేదని స్థానికులంటున్నారు. ఆమెకు ఏమైనా జరిగితే తమను నిందిస్తారని గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు.

ఏంకష్టమొచ్చిందో... కాలువ వంతెనపై నివశిస్తున్న మహిళ
ఏంకష్టమొచ్చిందో... కాలువ వంతెనపై నివశిస్తున్న మహిళ

ఆమెకు ఆ ఊరితో ఎలాంటి సంబంధం లేదు.. కానీ 20 రోజులుగా ఊరికి సమీపంలోనే ఉంటోంది. ఎవరు పలకరించినా పలకదు. ఎవరైనా తినడానికి ఏమైనా ఇస్తే మాత్రం తీసుకుంటోంది. ఎండా, వానా, పగలు, రాత్రి తేడా లేకుండా అక్కడే ఉంటోంది. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం పెదకొండూరు సమీపంలోని రేపల్లె కాలువ వద్ద ఓ మహిళ పరిస్థితి ఇది. కాలువ వంతెనకు మూలగా... బరకం వేసుకుని ఉంటోంది. ఊర్లోవాళ్లు పిలిచినా వెళ్లడం లేదు. గ్రామ సచివాలయ సిబ్బంది వెళ్లి వివరాలు అడిగినా స్పందించడం లేదు.

ఆమె వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నించిన ఈటీవి భారత్ ప్రతినిధితో మాత్రం తన పేరు కవాసి లక్ష్మి అని.... పశ్చిమగోదావరి జిల్లా పోలవరం గ్రామం అని చెప్పింది. ఇక్కడకు ఎందుకు వచ్చారని అడిగితే... మందో, మాకో పెడితే మీరు రారా అని ప్రశ్నించింది. ఎప్పుడూ ఇళ్లు దాటని తనని... చెట్లు పుట్టలు పట్టించారని చెప్పింది. తిరిగి పోలవరం వెళ్లేది లేదని... తన పుట్టినిళ్లు అయిన దేవీపట్నం మండలం మూలపాడు వెళ్తానని చెప్పింది. ఆమె జనావాసాలకు దూరంగా ఉండటంతో గ్రామ ప్రజల్లో కూడా ఆందోళన నెలకొంది. ఆమెకు ఏదైనా అయితే తమపైకి నిందలు వస్తాయేమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి : ఏపీ ప్రభుత్వం కెలికి కయ్యం పెట్టుకుంటుంది: తెలంగాణ సీఎం కేసీఆర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.