ETV Bharat / state

అభిమాని మృతి... ఆదుకున్న హీరో

author img

By

Published : Oct 28, 2020, 5:15 PM IST

cine actor prabhas financial help to his fan in west godavari district
కుటుంబసభ్యులను ఆదుకున్న హీరో

విద్యుదాఘాతంతో మృతి చెందిన తన అభిమాని కుటుంబానికి అండగా నిలిచాడు కథానాయకుడు ప్రభాస్. మృతుని కుటుంబసభ్యులకు ఆర్థిక సహాయం అందించి మిస్టర్ పర్​ఫెక్ట్ అనిపించుకున్నాడు.

పశ్చిమగోదావరి జిల్లా కాళ్ల మండలం లక్ష్మీ నరసింహపురంలో... కథానాయకుడు ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా కొందరు యువకులు బ్యానర్ కడుతుండగా... విద్యుత్ తీగలు తగిలి దుర్గా ప్రసాద్ అనే యువకుడు మృతి చెందాడు. మరో ఐదుగురికి గాయాలవటంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

విషయం తెలుసుకున్న నటుడు ప్రభాస్... మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి రెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించారు. బాధిత కుటుంబసభ్యులను స్థానిక ఎమ్మెల్యే మంతెన రామరాజు, ప్రభాస్ ఫ్యాన్స్ జిల్లా అధ్యక్షుడు ఉండి వాసు పరామర్శించారు.

ఇదీ చదవండి:

'అన్ని విషయాల్లో ఎస్​ఈసీ ఉత్తమ పద్ధతులను అనుసరిస్తోంది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.