ETV Bharat / state

పార్వతీపురం టు జపాన్... వయా జడ్పీ స్కూల్​

author img

By

Published : May 12, 2019, 8:03 AM IST

వారు నిరుపేద కూలీలు. పేదరికం వెంటాడుతున్నా కుమారుడిని బాగా చదివించాలని ఆరాటపడుతున్నారు. వారి అబ్బాయి కూడా తల్లిదండ్రుల కష్టాన్ని వృథా చేయలేదు. తోటి విద్యార్థుల కంటే భిన్నంగా ఆలోచించి ప్రతిభ చాటాడు. పలు మెరుగైన ప్రదర్శనలతో అంతర్జాతీయ పురస్కారం సొంతం చేసుకున్నాడు.

పార్వతీపురం టు జపాన్... వయా జడ్పీ పాఠశాల

పార్వతీపురం టు జపాన్... వయా జడ్పీ స్కూల్​

విజయనగరం జిల్లా పార్వతీపురం మండలం పెద్ద బండపల్లి గ్రామానికి చెందిన దేవాబత్తుల సునీల్... వైజ్ఞానిక ప్రదర్శనలో అంతర్జాతీయ పురస్కారం దక్కించుకున్నాడు. సునీల్ తల్లిదండ్రులు మల్లయ్య-దేవి కూలీ పనులు చేస్తూ... జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివిస్తున్నారు. సునీల్​ మొదట్నుంచి సైన్స్... ఎలక్ట్రికల్ అంశాలపై ఆసక్తి కనబర్చేవాడు. ఇది గుర్తించిన ఉపాధ్యాయులు... సునీల్​ను వైజ్ఞానిక ప్రదర్శనకు సిద్ధం చేశారు.

తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో... విద్యుత్ పొదుపు పరికరాన్ని రూపొందించాడు సునీల్. రైల్వేస్టేషన్, బస్టాండ్​లో ప్రయాణికులు లేకపోయినా... ఫ్యాను తిరుగుతూ... విద్యుత్ వృధా అవుతున్న విషయాన్ని గుర్తించి... నివారణకు ఆలోచన చేశాడు. విద్యుత్​ను ప్రయాణికులు కూర్చున్న కుర్చీలకు అనుసంధానం చేశాడు. కుర్చీలో కూర్చోగానే ఫ్యాన్ తిరిగేలా... లేవగానే ఆగేలా ఏర్పాటు చేశాడు. ఈ ప్రయోగానికి జిల్లాస్థాయిలో మంచి గుర్తింపు వచ్చింది.

ఇదే రూపకల్పనకు రాష్ట్ర, జాతీయస్థాయిలోనూ ప్రశంసలు దక్కాయి. అంతర్జాతీయ ప్రదర్శనకూ పిలుపు వచ్చింది. జపాన్​లో జరిగిన అంతర్జాతీయ ప్రదర్శనలో తాను రూపొందించిన విధానాన్ని వివరించాడు. సునీల్​ను మెచ్చిన సకూర సైన్స్ ఎక్స్​ఛేంజ్ ప్రోగ్రాం నిర్వాహకులు పురస్కారం ప్రదానం చేశారు. ప్రభుత్వ పాఠశాలలో చదివిన పేద విద్యార్థికి అంతర్జాతీయ పురస్కారం లభించడం గర్వకారణమని విద్యాశాఖాధికారులు, ఉపాధ్యాయులు, గ్రామస్థులు అభినందించారు.

ఇదీ చదవండి...

సరకు రవాణా నిర్వహణకు.. ఆర్టీసీ కొత్త టెండర్లు

Intro:మత్తు పదార్థాల పై అప్రమత్తంగా ఉండాలని కోరుతూ జంగారెడ్డి గూడెం ఆబ్కారీ శాఖ ఆధ్వర్యంలో శనివారం ప్రధాన సెంటర్లో అవగాహన సదస్సు నిర్వహించారు ఆబ్కారీ ఎస్ ఐ ఈ సత్యనారాయణ మత్తుపదార్థాల వినియోగం పై ప్రజలకు అవగాహన కల్పించారు మత్తు కలిగించే మాదక ద్రవ్యాలు నాటుసారా మితిమీరిన మద్యపానం గంజాయి విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు మత్తు పదార్థాలకు ప్రజల జీవితాలు చిన్నాభిన్నం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు వీటి బారిన పడకుండా సుఖంగా ఉండాలని కోరుతూ ప్రతి గ్రామంలో అవగాహన సదస్సు నిర్వహిస్తున్నామని చెప్పారు కార్యక్రమంలో ఎస్ ఐ ఎస్ ఎస్ పి రెడ్డి e సిబ్బంది పాల్గొన్నారు


Body:పోలవరం ప్రసాద్


Conclusion:పోలవరం ప్రసాద్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.