ETV Bharat / state

అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టివేత.. ముగ్గురు అరెస్ట్​

author img

By

Published : Feb 10, 2021, 10:21 AM IST

విజయనగరం జిల్లా పార్వతీపురంలో స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో అధికారులు భారీగా మద్యం సీసాలను పట్టుకున్నారు. ఈ ఘటనలో ముగ్గురిని అరెస్ట్​ చేసి.. వారి వద్ద నుంచి 700 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు.

illegal liquor
అక్రమ మద్యం పట్టివేత.. ముగ్గురు అరెస్ట్​

పార్వతీపురం శివారులో (ఆంధ్ర-ఒరిస్సా సరిహద్దు) స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో అధికారులు.. భారీగా మద్యం సీసాలను పట్టుకున్నారు. పంచాయతీ ఎన్నికల కారణంగా గ్రామల్లో తనిఖీ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఒడిశా నుంచి వస్తున్న ఆటోను తనిఖీ చేయగా 700 మద్యం సీసాలు ఉన్నట్లు గుర్తించారు. వాటి విలువ లక్ష రూపాయలు ఉండవచ్చునని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో బొబ్బిలి ప్రాంతానికి చెందిన ఇద్దరు యువకులు, ఆటో డ్రైవర్​ని అదుపులోకి తీసుకున్నారు. పంచాయతీ ఎన్నికల కోసం ఈ మద్యాన్ని ఎవరైనా తెప్పిస్తున్నారా.. అనే కోణంలో విచారణ చేస్తున్నామని అధికారులు తెలిపారు.

ఇదీ చదవండీ.. నవ దంపతుల ఆత్మహత్యాయత్నం...భర్త మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.