ETV Bharat / state

యువకుడిని హత్య చేసింది యజమాని బంధువులే!

author img

By

Published : Oct 1, 2019, 12:03 PM IST

Updated : Oct 2, 2019, 7:32 AM IST

యువకుడి హత్యకేసును ఛేదించిన పోలీసులు

విజయనగరం జిల్లా పెదతడివాడలో గత నెల 24న జరిగిన హత్య కేసును పోలీసులు చేధించారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు.

యువకుడి హత్యకేసును ఛేదించిన పోలీసులు

విజయనగరం జిల్లా పెదతడివాడలో సెప్టెంబరు 24న అంబటి నాగరాజు (23) అనే యువకుడు హత్యకు గురయ్యాడు. మృతుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను పట్టకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... అంబటి నాగరాజు అనే వ్యక్తి ఆసనాల పైడిరాజు దగ్గర పనిచేసేవాడు. యజమానికి అతని అన్న చిన్న పన్నకి.. పందుల పెంపకంలో వచ్చిన గొడవ జరిగింది. ఈ వివాదంలో నాగరాజు... పైడిరాజు అన్నని ప్రశ్నించాడు. ఆగ్రహించిన చిన్నపన్న కుమారులు.. నాగరాజును పందులు కట్టే తాడు ఉపయోగించి చంపేశారు. నిందితులను గుర్తించిన పోలీసులు.. అరెస్టు చేశారు.

ఇదీ చూడండి

భర్త సహజీవనం.... భార్య ఆగ్రహం... చిమ్మింది రక్తం...

Intro:ap_cdp_18_30_madyam_demand_av_ap10040
రిపోర్టర్: సుందర్, ఈ టీవీ కంప్యూటర్, కడప.

యాంకర్:
ప్రవేట్ మద్యం దుకాణాలకు ఈరోజు రాత్రి తో గడువు ముగియడంతో నేటి నుంచి ప్రభుత్వ మద్యం దుకాణాలు ప్రారంభమవుతాయి. ఈ మేరకు కడప లో ఉన్న ముప్పై మద్యం దుకాణాల్లో ఉదయమే మద్యం అయిపోవడంతో మందుబాబులు మద్యం కోసం బార్ల వద్దకు పరుగులు తీశారు. సినిమా టికెట్ల కోసం ఎలా ఎగబడ్డారు, అదే తరహాలో మద్యం కోసం ఎగబడ్డారు. కొన్ని బార్ల వద్ద తోపులాట జరిగింది. బార్ల యజమానులు మందు బాబులను నియంత్రించ లేకపోయారు. మద్యం దొరికింది చాలు రా దేవుడా అంటూ సంకలో పెట్టుకుని పరుగులు తీశారు. ఇదే అదునుగా భావించి బార్ల యజమానులు ఇక చివరి రోజు కావడంతో అధిక ధరకు విక్రయించారు.


Body:మద్యం కోసం ఎగబడ్డారు


Conclusion:కడప
Last Updated :Oct 2, 2019, 7:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.