ETV Bharat / state

ఒకే చున్నీ కట్టుకుని.. నదిలో దూకి ప్రేమ జంట ఆత్మహత్య!

author img

By

Published : Jun 30, 2021, 11:14 AM IST

Updated : Jun 30, 2021, 11:21 AM IST

ఒకరిపై ఒకరు మనసుపడ్డారు. హృదయాలు పంచుకున్నారు. జీవితాంతం హాయిగా కలిసుంటామని కలలు కన్నారు. పెద్దలు పెళ్లికి అంగీకరించలేదు. అయినా.... మూడుమళ్ల బంధంతో ఒక్కటయ్యారు. చివరికి.. పెద్దల వేధింపులు తాళ లేక.. వారి మాటలు విని విడివిడిగా ఉండలేక... ఆ జంట మరణంతో ఒక్కటవ్వాలనుకుంది. ఆత్మహత్యే శరణ్యమనుకొని ప్రాణాలు తీసుకుంది. విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలం తోటపల్లి బ్యారేజి వద్ద నదిలో దూకి ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్నారు.

lovers suicide at viajayanagaram
ఒకరినొకళ్ల చున్నీతో కట్టుకొని నదిలో దూకి ప్రేమ జంట ఆత్మహత్య..

విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలంలో ఓ ప్రేమ కథ విషాదాంతమైంది. పెద్దలు వారి ప్రేమను అంగీకరించలేదని తోటపల్లి బ్యారేజి వద్ద నదిలో దూకి నవ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. రెండు రోజుల క్రితం తోటపల్లి నాగావళి నదిలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. ఎస్సై సింహాచలం ఆధ్వర్యంలో పార్వతీపురం అగ్నిమాపక సిబ్బంది, గజ ఈతగాళ్లు జలాశయంలో గాలించారు.

బుధవారం ఉదయం స్పిల్​వేకు దగ్గరలో గాయత్రి, రాకేష్ మృతదేహాలు దొరికాయి. డ్యామ్​కీ 200 మీటర్ల దూరంలో మృతదేహలు దొరికినట్లు పోలీసులు తెలిపారు. ప్రేమించి.. పెళ్లి చేసుకున్న తమను వేధించినా కలిసి ఆనందంగానే జీవించామని... చావులోనూ తాము ఆనందంగా ఉన్నామని... ఇద్దరం కలిసి సంతోషంగా మరణిస్తున్నామని సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టుగా పోలీసులు చెప్పారు. ఒకే చున్నీని కట్టుకొని నదిలో దూకినట్టుగా గుర్తించామన్నారు.

ఒకరినొకళ్ల చున్నీతో కట్టుకొని నదిలో దూకి ప్రేమ జంట ఆత్మహత్య..

ఇదీ చదవండి:

BLAST: దర్భంగా పేలుడు.. తీగ లాగితే హైదరాబాద్​లో కదిలిన డొంక!

Last Updated : Jun 30, 2021, 11:21 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.