ETV Bharat / state

Nature Farming: ఉప ముఖ్యమంత్రి ఇంట.. పెరటి పంట

author img

By

Published : Feb 21, 2022, 12:14 PM IST

Deputy Chief Minister grows vegetables: అధికారిక కార్యక్రమాలతో తీరిక లేకున్నా.. దొరికే కొద్దిపాటి సమయాన్ని ఉపముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి సద్వినియోగం చేసుకుంటున్నారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సొంతంగా పెరటి తోట పెంపకం చేపట్టారు. బయటి మార్కెట్​లో రసాయన ఎరువులు వినియోగించి పండించిన కూరగాయలు లభిస్తుండడంతో సేంద్రియ పద్ధతిలో పండించాలని నిర్ణయించినట్లు ఆమె తెలిపారు.

Deputy Chief Minister grows vegetables
Deputy Chief Minister grows vegetables

Deputy Chief Minister grows vegetables: ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సొంతంగా పెరటి తోట పెంచుతున్నారు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, గిరిజన శాఖ మంత్రి పాముల పుష్ప శ్రీవాణి. అధికారిక కార్యక్రమాలతో తీరిక లేకున్నా.. దొరికే కొద్దిపాటి సమయాన్ని ఇలా సద్వినియోగం చేసుకుంటున్నారు. విజయనగరం జిల్లా జియ్యమ్మవలస మండలంలోని చినమేరంగి గ్రామంలోని తన ఇంటి ఆవరణలో పెరటితోట పెంచుతున్నారు.

బయటి మార్కెట్​లో రసాయన ఎరువులు వినియోగించి పండించిన కూరగాయలే లభిస్తుండడంతో.. సేంద్రియ పద్ధతిలో పండించాలని నిర్ణయించినట్లు ఆమె తెలిపారు. సుమారు 20 సెంట్ల స్థలంలో క్యారెట్‌, బీట్‌రూట్‌, ముల్లంగి, క్యాబేజీ, టమాటా, వంగ, ఆకుకూరలు సాగు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రకృతి సాగు వల్ల భూసారం పాడవ్వకుండా, నాణ్యమైన దిగుబడి వస్తుందని, ఆ పంటలు ఆర్యోగానికీ మేలు చేస్తాయని వివరించారు.


ఇదీ చదవండి:

అభిమాని అత్యుత్సాహం.. పడిపోయిన పవన్ కల్యాణ్..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.