ETV Bharat / state

గిరిజనులను కబళిస్తున్న అంతుచిక్కని వ్యాధి

author img

By

Published : Nov 20, 2020, 5:23 AM IST

అన్నెం పున్నెం ఎరుగని గిరిజనాన్ని అంతుచిక్కని వ్యాధి చుట్టుముట్టింది. ఒక్కొక్కరినీ కబళిస్తోంది. అసలే అంతంతమాత్రం వైద్యంతో నెట్టుకొచ్చే అడవి బిడ్డలు... ప్రాణాలు కాపాడుకొనే దారి తెలియక వణికిపోతున్నారు. ఇప్పటికే పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయిన వేళ.... గూడెంలో పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి.

An elusive disease devouring tribes in vizianagaram
గిరిజనులను కబళిస్తున్న అంతుచిక్కని వ్యాధి

గిరిజనులను కబళిస్తున్న అంతుచిక్కని వ్యాధి

విజయనగరం జిల్లా పాచిపెంట మండల పరిధిలోని చిల్లమామిడిగూడెంలో... అంతుచిక్కని వ్యాధి అమాయకుల ప్రాణాలను హరిస్తోంది. శరీరం మొత్తం బొబ్బలు రావడం సహా... కాళ్లు, చేతులు వంకర్లు పోయి ఒక్కొక్కరుగా మరణిస్తున్నారు. పది రోజుల వ్యవధిలోనే 8మంది చనిపోవడం భయాందోళనలు రేకెత్తిస్తోంది. మూడేళ్ల కిందట ఒకేసారి ఐదుగురు ఈ విధంగా మృతి చెందారు. నాటి నుంచీ మొత్తం 32 మందిని ఈ రోగం బలి తీసుకుంది. మరికొంత మంది వ్యాధి లక్షణాలతో కృశించిపోతున్నారు.

చిల్లమామిడిగూడెంలో 36 ఇళ్లు ఉండగా.... 2వందల మందికి పైగా గిరిజనులు జీవనం సాగిస్తున్నారు. వింత రోగంపై పలుమార్లు ఫిర్యాదు చేసినా స్పందన కరవైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లాకే... ఒక్కరోజు వైద్య శిబిరం నిర్వహించారన్నారు.

స్థానికంగా దొరికే మద్యం, కల్లు తాగుతుండటమే గిరిజనుల్లో ప్రమాదకర లక్షణాలకు కారణమని వైద్యులు చెబుతున్నారు. శరీర భాగాలు పాడైపోయి.. కాళ్లు, శరీరంపై వాపులు వస్తున్నాయని విశ్లేషించారు. వింత వ్యాధి కారణాలను పూర్తిస్థాయిలో నిగ్గు తేల్చి, ప్రాణాలు కాపాడాలని గిరిజనులు కోరుతున్నారు.

ఇదీ చదవండీ... విమానాశ్రయ అభివృద్ధి కోసం భూములిచ్చారు.. పరిహారం అందక నష్టపోతున్నారు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.