ETV Bharat / state

MP GVL vs MP Vijayasai: 'అయ్యా.. అబద్ధాల నరసింహా.. ఏం ఇచ్చారో చెప్పండి చాలు..'

author img

By

Published : Feb 14, 2022, 7:24 PM IST

MP GVL vs MP Vijayasai: వైకాపా ప్రభుత్వంపై భాజపా ఎంపీ జీవీఎల్ చేసిన విమర్శలకు ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. ఏపీ కోసం తాము అడగనిది లేదని... దానికి మీరు ఏం ఇచ్చారో చెప్పండి అంటూ ప్రశ్నించారు.

YCP MP Vijayasai Reddy
YCP MP Vijayasai Reddy

MP Vijayasai Reddy tweet on MP GVL : భాజపా ఎంపీ జీవీఎల్ విమర్శలపై వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. అయ్యా.. అబద్ధాల నరసింహా.. అంటూ ప్రశ్నలు సంధించారు. వైకాపా 22 ఎంపీ సీట్లు గెలిచినందుకే ఏపీకి న్యాయం చేయట్లేదా? లేక భాజపాకు 301 సీట్లు వచ్చినందుకు న్యాయం చేయట్లేదా..? అని నిలదీశారు. రాష్ట్రం కోసం తాము అడగనిది లేదని స్పష్టం చేశారు. దానికి మీరు ఏం ఇచ్చారో చెప్పండి చాలు అంటూ సెటైర్లు విసిరారు.

  • అయ్యా... అబద్ధాల నరసింహా!
    2019 సార్వత్రిక ఎన్నికలో మేం 22 మంది లోక్‌ సభ సభ్యుల్ని గెలుచుకోవటం వల్ల మీరు ఏపీకి న్యాయం చేయటం లేదా? లేక మీ పార్టీకి 301 రావటం వల్ల ఏపీకి న్యాయం చేయటం లేదా? రాష్ట్రం కోసం మేం అడగనిది లేదు. మీరు ఏం ఇచ్చారన్నది చెప్పండి చాలు!

    — Vijayasai Reddy V (@VSReddy_MP) February 14, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఎంపీ జీవీఎల్ విమర్శలు.. ఏమన్నారంటే..

వైకాపా ఎంపీలకన్నా భాజపా పార్లమెంట్‌ సభ్యులే ఏపీకి ఎక్కువ మేలు చేసే పనులు చేస్తున్నారని.. ఆ పార్టీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు అన్నారు. ఇవాళ మీడియాతో మాట్లాడిన జీవీఎల్.. రాష్ట్రంలోని అధికార పార్టీకి కేవలం ప్రచార ఆర్భాటం తప్ప.. సమస్యల పరిష్కారంపై ఏ మాత్రం దృష్టి లేదన్నారు. తెలంగాణతో వివాదం లేని అంశాలను సరి చేయాలనే విభజన కమిటీకి చెప్పామన్న ఆయన.. తెలుగుదేశం నేతలు చెబితే హోదా అంశాన్ని తొలగించారనే ప్రచారాన్ని మానుకోవాలని వైకాపాకు సూచించారు.

"ఏపీలో నిధుల కోసం చట్టసభల్లో నేనే ప్రస్తావించా. వైకాపా ఎంపీలు చేయాల్సిన పని నేనే చేస్తున్నా. కేంద్ర పథకాలకు స్టిక్కర్లు వేసుకుని ప్రచారం చేస్తున్నారు. మీ కృషి ఎక్కడైనా ఉందా అని వైకాపా ఎంపీలను ప్రశ్నిస్తున్నా. బడ్జెట్‌లో రాష్ట్ర ప్రస్తావన లేదని అసత్యాలు ప్రచారం చేస్తారా ? ఏమీ చేయకుండానే ప్రాజెక్టులు, రహదారులు వచ్చాయా ? కనీసం కేంద్ర మంత్రుల అపాయింట్‌మెంట్‌ తెచ్చుకోలేదు. సరైన ఆదాయ వనరులు లేని రాష్ట్రానికి హోదా ఇవ్వాలి. ఏపీకి అంతకుమించి ప్యాకేజీ రూపంలో కేంద్రం నిధులు ఇచ్చింది. అన్నీ తెలిసీ జగన్ ప్రత్యేక హోదా అంశాన్ని ఎత్తుకున్నారు. కేంద్ర హోంశాఖ సెక్రటరీ అజయ్ కుమార్ భల్లాకి లేఖ రాశా. ఇరు రాష్ట్రాల మధ్య వివాదాస్పద సమస్యలపై చర్చించాలి. సూచనలు చేసే కమిటీ అన్ని అంశాలు పరిగణలోకి తీసుకోవాలి. ఏపీకి ప్రత్యేక హోదా అంశంతో తెలంగాణకు సంబంధం లేదు. కమిటీలో చేసిన నిర్ణయాలను అమలు చేసేలా చూడాలి. హోదా అంశంలో కేంద్రం, ఏపీ మధ్య చర్చలు ఏర్పాటు చేయాలి. ప్రత్యేక హోదా లేదు.. నిధుల సమీకరణ కోసం కృషి చేయండి. తెలుగు రాష్ట్రాల మధ్య సమస్యలు త్వరలో పరిష్కారమవుతాయి. నేనేదో మాట్లాడి హోదా అంశం తొలగించారనడం ఆశ్చర్యంగా ఉంది. మోదీ, అమిత్‌ షా నిర్ణయిస్తే మేము మార్చగలమా ?" -జీవీఎల్‌, భాజపా ఎంపీ

ఇదీ చదవండి

సీఎం ముఖ్యకార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ బదిలీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.