ETV Bharat / state

'మధ్యాహ్న భోజన పథకానికి బడ్జెట్ కేటాయింపులు పెంచాలి'

author img

By

Published : Jan 27, 2021, 3:40 PM IST

మధ్యాహ్న భోజన పథకానికి బడ్జెట్ కేటాయింపులు పెంచాలని ఈ పథకం కార్మికులు డిమాండ్ చేశారు. ఈమేరకు విశాఖలోని జీవీఎంసీ గాంధీ పార్కులో నిరసన చేపట్టారు.

mid day meals protest at visakha
మధ్యాహ్న భోజన పథకానికి బడ్జెట్ కేటాయింపులు పెంచాలి

కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత కల్పించాలని మధ్యాహ్న భోజన పథకం సిబ్బంది డిమాండ్ చేశారు. ఈ పథకానికి బడ్జెట్ కేటాయింపులు పెంచాలని డిమాండ్ చేస్తూ.. విశాఖలోని జీవీఎంసీ గాంధీ పార్కులో నిరసన చేపట్టారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా బడ్జెట్ పెంచాల్సిందిపోయీ... రూ. 2 వేల కోట్లు తగ్గించడం శోచనీయమన్నారు.

కొందరు అధికార పార్టీ నాయకులు వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం స్పందించి ఈ పథకానికి రాబోయే బడ్జెట్​లో నిధులు పెంచాలన్నారు. తమకు ప్రతినెలా 5వ తేదీలోగా జీతాలు చెల్లించాలన్నారు. ఈ పథకాన్ని ప్రైవేటు పరం చేయాలన్న ఆలోచనను మార్చుకోవాలన్నారు.

ఇదీ చూడండి: 'ధిక్కరణ కేసు'పై నేడు హై కోర్టులో విచారణ... హాజరు కానున్న డీజీపీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.