ETV Bharat / state

కార్గో హ్యాండ్లింగ్​లో విశాఖ పోర్టు ఆల్ టైం రికార్డ్

author img

By

Published : Apr 28, 2020, 1:33 PM IST

Updated : Apr 28, 2020, 6:46 PM IST

vizag-port-record-in-cargo-handling-this-year
కార్గో హ్యాండ్లింగ్​లో విశాఖ పోర్టు ఆల్ టైం రికార్డ్

మార్చితో పూర్తయిన ఆర్ధిక సంవత్సరంలో విశాఖపట్నం పోర్టు గతంలోని కార్గో హ్యాండ్లింగ్ రికార్డులను తిరగరాసింది. ఆ ఉత్సాహంలో ఈ యేడాది మరిన్ని లక్ష్యాలను నిర్దేశించుకుంటోంది. కరోనా నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ ప్రపంచ వ్యాప్తంగా పోర్టుల కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నప్పటికీ.. దాన్ని అధిగమించేందుకు ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకునేందుకు సిద్దమవుతోంది.

విశాఖపట్నం పోర్టు 2019-20 ఆర్ధిక సంవత్సరంలో 72.72 మిలియన్ మెట్రిక్ టన్నుల కార్గో హ్యాండ్లింగ్ చేసి సరికొత్త ఆల్ టైం రికార్డును నమోదు చేసింది. మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి 11.15 శాతం వృద్ది రేటుతో ఈ రికార్డును సృష్టించింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో 65.30 మిలియన్ టన్నుల కార్గోని హ్యాండిల్ చేసిన విశాఖ పోర్టు ఈ ఏడాది 7.42 మిలియన్ టన్నుల కార్గోని దానికి జత చేయగలిగింది. దేశంలో కాండ్లా, పారదీప్ పోర్టుల తర్వాత స్థానంలో నిలిచింది. జవహర్​లాల్ నెహ్రూ, ముంబయి పోర్టులను అధిగమించి మూడో స్ధానాన్ని దక్కించుకుంది.

పోటీని తట్టుకుని నిలిచి

విశాఖ పోర్టుకు అత్యంత సమీపంలోనే ఉన్న గంగవరం పోర్టు నుంచి గట్టి పోటీ ఉంది. అలానే కృష్ణపట్నం నుంచి కూడా పోటీని తట్టుకుంటూ ఈ రికార్డును సాధించడం విశేషం. కొవిడ్ ప్రభావం వల్ల గడచిన అర్ధిక సంవత్సరంలో చివరి 3 నెలలు తీవ్రమైన ఆర్థిక మందగమనం ఏర్పడినా.. ఇంత వృద్ధి రేటు సాధించడం సమష్టి కృషి వల్లనే సాధ్యపడిందని పోర్టు ఛైర్మన్ రామ్మోహనరావు చెబుతున్నారు.

అన్నింటిలోనూ పురోగతి

గతేడాది విశాఖ పోర్టు క్రూడాయిల్ 18.92 మిలియన్ మెట్రిక్ టన్నులు, ఇనుము ముడిఖనిజం, పిల్లెట్​లు 14.39 మిలియన్ మెట్రిక్ టన్నులు, కొకింగ్ బొగ్గు 7.45 ఎంఎంటీలు, స్టీం కోల్ 9.27 ఎంఎంటీలు, 5.03 లక్షల కంటైనర్లను ఈ పోర్టు హ్యాండిల్ చేసింది. పెరుగుదల పరంగా గమనిస్తే ముడి ఇనుము రవాణాలో 41 శాతం, కొకింగ్ కోల్​లో 28 శాతం, క్రూడాయిల్​లో 16 శాతం, కంటైనర్లలో 12 శాతం పురోగతి సాధించింది.

నేపాల్ కంటైనర్ కార్గోను 42,550కి పెంచగలిగింది. గతేడాది ఈ సంఖ్య 16,292 మాత్రమే. కోల్​కతా కన్నా నేపాల్​కి విశాఖ పోర్టు దూరం. అయినా కూడా ఆ పోర్టును ఈ విషయంలో వెనక్కి నెట్టగలిగింది. 32.1 మిలియన్ టన్నుల రైల్వే ట్రాఫిక్ ను కూడా విశాఖ పోర్టు హ్యాండిల్ చేసి ఇందులో 16.7 శాతం పురోగతి సాధించింది. 198 కోట్ల రూపాయిలతో రెండు కొత్త బెర్తుల నిర్మాణం పూర్తి చేయగలిగింది.

కార్గో హ్యాండ్లింగ్​లో విశాఖ పోర్టు ఆల్ టైం రికార్డ్

ఇవీ చదవండి.. 'గొడుగుతో కరోనా దరిచేరదు'

Last Updated :Apr 28, 2020, 6:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.