ETV Bharat / state

పింఛన్ల పంపిణీలో అక్రమాలు.. 9 మంది వాలంటీర్ల తొలగింపు

author img

By

Published : Jan 8, 2022, 9:19 AM IST

Updated : Jan 8, 2022, 10:07 AM IST

scam in pension
scam in pension

09:15 January 08

సర్పంచ్​పై మూడు నెలల సస్పెన్షన్‌ వేటు

విశాఖ జిల్లా కోటవురట్ల మండలం చౌడువాడలో 9 మంది గ్రామ వాలంటీర్లను తొలగించారు. పంచాయతీ పరిధిలో పింఛన్ల పంపిణీలో అవకతవకలపై కలెక్టర్‌ మల్లిఖార్జున ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో తొమ్మిది మంది గ్రామ వాలంటీర్లను కలెక్టర్‌ విధుల నుంచి తొలగించారు.

ఈ ఘటనకు బాధ్యుల్ని చేస్తూ.. గ్రామ సచివాలయ సంక్షేమ సహాయకుడిని సస్పెండ్​ చేశారు. సర్పంచ్​ను సైతం మూడు నెలలపాటు విధుల నుంచి సస్పెండ్​ చేశారు. అటు పంచాయతీ కార్యదర్శి జె.వి.పరమేశ్వరరావుకు సైతం షోకాజ్‌ నోటీసు జారీ చేశారు.

పింఛను అందజేసినందుకు.. పింఛనుదారుల నుంచి డబ్బులు వసూలు చేసినందుకు కలెక్టర్ ఈ చర్యలు తీసుకున్నారు. ఇలాంటి చర్యలను ఉపేక్షించేది లేదని, లబ్ధిదారుల నుంచి ఎవరైనా డబ్బు వసూలుచేస్తే.. కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ మల్లిఖార్జున హెచ్చరించారు.

ఇదీ చదవండి: సచివాలయ సిబ్బంది చేతివాటం.. పింఛన్​లో వెయ్యి రూపాయల కోత!

Last Updated : Jan 8, 2022, 10:07 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.