ETV Bharat / state

రంగురంగుల గుడారాలు.. గోవాలో కాదు మన విశాఖ బీచ్​లోనే

author img

By

Published : Mar 12, 2021, 10:07 AM IST

విశాఖ బీచ్ గోవా బీచ్​లాగానే కనిపించబోతోంది ఇకమీదట. ఎలా అంటారా.. సముద్ర అలలను చూస్తూ ఉండిపోయేలా.. సేద తీరడానికి పర్యటకుల కోసం గుడారాలను ఏర్పాటు చేస్తున్నారు. గోవా బీచ్​లో ఎలా ఉన్నాయో...ఇప్పుడు మన దగ్గర కూడా అలానే ఉండబోతుంది. విశాఖ ఓ బీచ్​లో ఇలా ఉందో మీరు చూస్తారా..!

tents at visakha rk beach
విశాఖ బీచ్‌

విశాఖ సముద్ర తీరంలో సందర్శకులను ఆకట్టుకునే విధంగా గుడారాలను ఏర్పాటు చేశారు. ఆర్కే బీచ్‌లోని ఇసుక తిన్నెలపై పర్యటకులు సేద తీరేందుకు రంగు రంగుల వస్త్రాలతో గుడారాలు తీర్చిదిద్దారు. జీవీఎంసీ అనుమతితో ఓ ప్రైవేటు సంస్థ వీటిని అందుబాటులోకి తెచ్చింది. గుడారాలను వినియోగించుకునే వారు గంటకు రూ.50 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఈ గుడారాలను చూసేవారు ఆర్కే బీచ్​.. గోవాను తలపిస్తోందని అంటున్నారు.

ఇదీ చూడండి. అరవై మూడు జంటలకు అట్టహాసంగా షష్టి పూర్తి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.