ETV Bharat / state

'జీవీఎంసీ ఎన్నికల్లో తెదేపా క్లీన్​స్వీప్ ఖాయం'

author img

By

Published : Mar 3, 2021, 1:48 PM IST

జీవీఎంసీ మేయర్ పీఠాన్ని తెదేపా గెలుచుకుంటుందని తెలుగు శక్తి అధ్యక్షులు బీవీ రామ్ అన్నారు. విశాఖ అభివృద్ధి తెదేపా హయాంలోనే జరిగిందన్నారు.

gvmc
'జీవీఎంసీ ఎన్నికల్లో తెదేపా క్లీన్​స్వీప్ చేస్తుంది'

రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో జీవీఎంసీ మేయర్ పీఠాన్ని తెదేపా కైవసం చేసుకుంటుందని తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ విశాఖలో జోస్యం చెప్పారు. నగరాన్ని అభివృద్ధి చేయడంలో తెదేపా ఎనలేని కృషి చేసిందని స్పష్టం చేశారు.

ఆ కృషికి ఫలితాన్ని ప్రజలు కార్పొరేషన్ ఎన్నికల ద్వారా అందిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. విశాఖను పరిపాలనా రాజధానిగా చేయడంలో తమకు ఎలాంటి అభ్యంతరం లేనప్పటికీ.. అమరావతికి అన్యాయం చేస్తే మాత్రం పోరాటం తప్పదని హెచ్చరించారు.

ఇదీ చదవండి:

మున్సిపల్ ఎన్నికల వేళ.. వైకాపా నుంచి తెదేపాలోకి వలసలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.