ETV Bharat / state

అన్నక్యాంటీన్ల మూసివేతపై..రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు

author img

By

Published : Aug 16, 2019, 6:59 PM IST

అన్న క్యాంటీన్లు మూసివేయడాన్ని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా తెదేపా కార్యకర్తలు ఆందోళనలు చేపట్టారు. పలుచోట్ల అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు.

రాష్ట్రవ్యాప్తంగా అన్నక్యాంటీన్ల మూసివేతపై ఆందోళనలు

రాష్ట్రవ్యాప్తంగా అన్నక్యాంటీన్ల మూసివేతపై ఆందోళనలు

అన్న క్యాంటీన్లను యథాతథంగా నడిపించాలని డిమాండ్ చేస్తూ విశాఖలో ఇవాళ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఆధ్వర్యంలో తెదేపా కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. అన్న క్యాంటీన్ లను మూసివేయడం లేదని అసెంబ్లీ సాక్షిగా మాట ఇచ్చిన మంత్రి బొత్స సత్యనారాయణ ఒక్కరోజులోనే మాట తప్పరన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్లను మూసివేయడం శోచనీయమని వెలగపూడి రామకృష్ణబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా ప్రభుత్వానికి తెలుగు దేశం పేరు మీద ఉన్న పేర్లు నచ్చకపోతే... పేర్లు మార్చి అయినాసరే అన్న క్యాంటీన్లను యథాతథంగా నడిపించాలని కోరారు. పేదలకు తక్కువ ధరకు భోజనం అందించేందుకు ఉద్దేశించిన పథకాన్ని మూసివేయడం సరైన పద్ధతి కాదని అన్నారు. విశాఖలోని ఎంవీపి రైతు బజార్ వద్ద ఉన్న అన్న క్యాంటీన్ వద్ద వెలగపూడి రామకృష్ణబాబు ఆధ్వర్యంలో అన్నదానం చేశారు.

నెల్లూరు జిల్లా కావలిలో అన్న క్యాంటీన్లు తెరవాలని తెదేపా ఎంపీ అభ్యర్థి విష్ణువర్థన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆందోళనలు చేశారు. పేదవారిని ఆదుకోవటంలో వైకాపా ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.

ఇవీ చదవండి

విశాఖలో.. 2020లో సంయుక్త నౌకాదళ విన్యాసం

Intro:రిపోర్టర్ : కె. శ్రీనివాసులు
సెంటర్   :  కదిరి
జిల్లా      :అనంతపురం
మొబైల్ నం     7032975449
Ap_Atp_47_16_Nyawadula_Ryally_AV_AP10004


Body:న్యాయవాదిపై దాడి చేసి దుర్భాష లాడిన నంతపురం జిల్లా ముదిగుబ్బ ఎస్సై శ్రీనివాసులు పై చర్యలు తీసుకోవాలంటూ కదిరి బార్ అసోసియేషన్ ర్యాలీ చేపట్టింది. కదిరిలో సమావేశమైన బార్ అసోసియేషన్ సభ్యులు న్యాయవాది చత్రే నాయక్ పై ముదిగుబ్బ ఎస్ఐ శ్రీనివాసులు దురుసుగా ప్రవర్తించిచేయి చేసుకోవడాన్ని ఖండించారు. ఎస్సై తీరుపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోకపోవడంతో కదిరి న్యాయస్థానంలో ప్రైవేటు కంప్లైంట్ నమోదు చేశారు. పోలీసు ఉన్నతాధికారులు బాధ్యతారాహిత్యం చర్యలను నిరసిస్తూ న్యాయవాదులు పట్టణంలోని ప్రధాన రహదారుల్లో ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ కూడలిలో మానవహారం నిర్వహించి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. న్యాయవాదిపై దాడి చేసిన ఎస్సై పై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు స్పందించని పక్షంలో ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.


Conclusion:

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.