ETV Bharat / state

Vizag Steel Plant Privatization: 'విశాఖ స్టీల్ ప్లాంట్​ను భవిష్యత్తులో ప్రైవేటీకరణ చేస్తారా?'

author img

By

Published : Apr 13, 2023, 7:42 PM IST

Updated : Apr 14, 2023, 6:17 AM IST

Vizag Steel Plant Privatization Issue: విశాఖ స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నామని కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలపై నమ్మకం లేదని ఉక్కు కార్మిక సంఘం నేతలు అన్నారు. ఉక్కు ప్రైవేటీకరణని వెనక్కి తీసుకుంటున్నామని క్యాబినెట్ తీర్మానం చేసే వరకు పోరాటం ఆగదని తేల్చి చెప్పారు. ప్రైవేటీకరణ రద్దుని ప్రధాని స్వయంగా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు.

Etv Bharat
Etv Bharat

Vizag Steel Plant Privatization: 'విశాఖ స్టీల్ ప్లాంట్​ను భవిష్యత్తులో ప్రైవేటీకరణ చేస్తారా?'

Vizag Steel Plant Privatization : విశాఖ ఉక్కు పరిశ్రమ అంశం రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్ర మంత్రుల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. మంత్రులు ఒకరిపై ఒకరు విమర్శలకు ప్రతి విమర్శలు చేసుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. ఈ తరుణంలో గురువారం కీలక పరిణామం చోటు చేసుకుంది. కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్‌ కులస్తే స్టీల్ ప్లాంట్​ను సందర్శించారు. విశాఖ పోర్టు కళావాణి స్టేడియంలో రోజ్‌గార్ మేళా ఏర్పాటు చేశారు. ఈ మేళాలో ఆయన స్టీల్​ ప్లాంట్​ ప్రైవేటీకరణపై మాట్లాడారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నామని ఫగ్గన్ సింగ్‌ కులస్తే అన్నారు. స్టీల్‌ప్లాంట్‌లో కొత్త విభాగాలు ప్రారంభించి, స్టీల్‌ ప్లాంట్‌ను బలోపేతం చేయడానికి ప్రయత్నాలు చేస్తామని అన్నారు. ఆర్‌ఐఎన్‌ఎల్‌ అధికారులతో భేటీ అవుతున్నామన్నారు.

ప్రైవేటీకరణ రద్దుని ప్రధాని స్వయంగా ప్రకటించాలి : విశాఖ స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నామని కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలపై నమ్మకం లేదని ఉక్కు కార్మిక సంఘం నేతలు అన్నారు. తాత్కలికంగా విశాఖ స్టీల్ ప్లాంట్​ను ప్రైవేటీకరణ చేయడం లేదని ప్రకటన చేశారాంటే భవిష్యత్తులో చేస్తారా అని ప్రశ్నించారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో చేసిన ఈ తాజా ప్రకటన కేంద్ర ఎత్తుగడలో భాగంగా అభిప్రాయపడ్డారు. ఉక్కు ప్రైవేటీకరణని వెనక్కి తీసుకుంటున్నామని క్యాబినెట్ తీర్మానం చేసే వరకు పోరాటం ఆగదని తేల్చి చెప్పారు. ప్రైవేటీకరణ రద్దుని ప్రధాని స్వయంగా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు.

ప్రభుత్వ ఆధీనంలో వందేళ్ళుకు సరిపడా బొగ్గు గనులు ఉన్నాయని, విశాఖ ఉక్కు కర్మాగారంకి సొంత గనులు కేటాయించాలని, పూర్తి స్థాయిలో ముడి సరుకు ఏర్పాటు చేయాలి కార్మిక సంఘం నేతలు డిమాండ్ చేశారు.

" ఈ ప్రపంచంలో తెలుగువారు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి అలాంటి ప్రకటన చేసిందని అనుకుంటున్నాం. ఈ ప్రకటనతో మేము సంతృప్తి చెందడం లేదు. విశాఖ పర్యటనకు వచ్చిన స్టీల్ సహాయ శాఖ మంత్రి ఫగ్గన్ సింగ్‌ కులస్తే గారు తాత్కలికంగా విశాఖ స్టీల్ ప్లాంట్​ను ప్రైవేటీకరణ చేయడం లేదని ప్రకటన చేశారంటే భవిష్యత్తులో చేస్తారా? విశాఖ స్టీల్ ప్లాంట్​ను ప్రైవేటీకరణ చేయడం కోసం మీరు నియమించిన లీగల్ అడ్వైజర్​ను రద్దు చేయండి. మీరు నియమించిన కమిటీని రద్దు చేయండి అప్పుడు మేము నమ్ముతాం. దీన్ని ఏ క్యాబినేట్ సబ్ కమిటీ ప్రకటన చేసిందో అదే క్యాబినేట్ సబ్ కమిటీ రద్దు చేస్తున్నట్టు ప్రకటన చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రభుత్వ ఆస్తి ప్రభుత్వ పేరు మీద ఉండాలి తప్ప ప్రభుత్వ ఆస్తి అదానీ, అంబానీకి ఇస్తానంటే ఏ తెలుగోడు ఒప్పుకోడు మా పొరాటాన్ని ఉద్ధృతం చేస్తాం. " - ఉక్కు కార్మిక సంఘం నేతలు

ఇవీ చదవండి

Last Updated : Apr 14, 2023, 6:17 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.