ETV Bharat / state

'ఓట్ల తొలగింపు'పై ఇంటింటి విచారణ

author img

By

Published : Mar 6, 2019, 7:57 PM IST

విశాఖ జిల్లా అనకాపల్లిలో తమ కార్యకర్తల ఓట్లు తొలగించారంటూ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ... ఆర్డీవో సూర్యకళకు వినతి పత్రం అందజేశారు. ఈ వ్యవహారంపై ఇంటింటి విచారణకు ఉన్నతాధికారులు నిర్ణయించారు.

ఫారం7 దరఖాస్తులపై విచారణ చేపట్టాలని ఆర్డీవోకు వినతి పత్రం సమర్పిస్తున్న ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ

ఫారం7 విచారణ చేపట్టాలని ఆర్డీవోకు వినతి పత్రం సమర్పిస్తున్న ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ
విశాఖ జిల్లా అనకాపల్లిలో తమ కార్యకర్తల ఓట్లను తొలగించారంటూ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ... ఆర్డీవో కార్యాలయంలో ధర్నా చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆర్డీవో సూర్యకళకు వినతి పత్రం అందజేశారు. వెంటనే ఉన్నతాధికారులు విచారణ మొదలుపెట్టారు. దరఖాస్తులో ఉన్న వారినుంచి వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా.. కొందరు తమ పేరుతో దాఖలైన ఓట్ల తొలగింపు దరఖాస్తులతో తమకు సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు.. పోలింగ్ కేంద్ర అధికారులు ఇంటింటా తిరిగి పూర్తి వివరాలు నిర్థారించుకోవాలని ఆదేశించామని ఆర్డీవో చెప్పారు. ఓటరు జాబితా నుంచి పేర్ల తొలగింపునకు ఎలాంటి దరఖాస్తు చేయలేదని చెప్పిన వాళ్ల నుంచి..సంతకాన్ని తీసుకోవాలనినిర్ణయించామన్నారు.
Intro:Ap_vsp_46_06_otla_tolagimpu_darakastu_Ragada_ab_c4
విశాఖ జిల్లా అనకాపల్లి లో ఓట్లను తొలగించాలని ఫారం 7 కింద చేసిన దరఖాస్తు ల పై రగడ నెలకొంది. అనకాపల్లి నియోజకవర్గంలో 10200 ఓట్లను తొలగించాలంటూ ఫారం7 కింద కొంతమంది వ్యక్తులు దరఖాస్తు చేశారు. దరఖాస్తుదారుల పేర్లపై పోలింగ్ బూతుల వారీగా ఓటర్లను తొలగించాలని దరఖాస్తులు అధిక సంఖ్యలో వచ్చాయి వీటిని పరిశీలించగా దరఖాస్తుదారులు , ఓటర్ జాబితాలో పేరును తొలగించాలని నమోదు చేసుకున్న వారి కి తెలియకుండానే ఆన్లైన్లో ఫారం7 కింద దరఖాస్తులు చేశారని తేలింది దీంట్లో తెదేపాకు చెందిన ఓటర్లను తొలగించాలంటూ అధికంగా ఫారం7 దరఖాస్తులు వైకాపాకు చెందిన నాయకులు పేర్ల మీద దరఖాస్తు చేశారని స్థానిక ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ తెదేపా నాయకులు కార్యకర్తలతో కలిసి ఆర్డీవో కార్యాలయంలో ధర్నా చేపట్టారు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వినతి పత్రం అందజేశారు అనకాపల్లి నియోజకవర్గంలో ఫారం7 దరఖాస్తులు అధికంగా రావడంతో బూత్ లెవెల్ అధికారులతో ఆర్డీవో సూర్యకళ విచారణ చేపట్టారు ఓటర్ జాబితాలో తొలగించాలని వచ్చిన పేర్లు ఆధారంగా విచారణ చేస్తుండగా వారికి సంబంధం లేకుండా ఆన్లైన్లో దరఖాస్తులు చేశారన్న విషయం తేలింది తాము అనకాపల్లి లోనే ఉంటున్నామని తమ ఓట్లను తొలగించాలని ఎవరి దరఖాస్తు చేస్తున్నారో అర్థం కావడం లేదని ప్రజలు వాపోతున్నారు దరఖాస్తుదారుని విచారిస్తే తనకు సంబంధం లేదని చెపుతున్నారు. దీంతో బి ఎల్ వో లు ఇంటింటా తిరిగి స్టేట్మెంట్ తీసుకుంటున్నారు


Body:అనకాపల్లి నియోజకవర్గంలో 2014 లో జరిగిన ఎన్నికల్లో 23 వేల పైగా స్థానిక ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ గెలుపొందారు నియోజకవర్గంలోని తెదేపా ఓటర్లను తొలగించేలా ప్రతిపక్షం కుట్రపన్ని ఎన్నికల్లో గెలవాలని చూస్తుందని దీనికోసమే 10, 200 ఓట్లను తొలగించేలా పన్నాగం పన్నారని బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ అనకాపల్లి ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు వైకాపాకు చెందిన నాయకులు దీనిపై విచారణ చేపట్టాలంటూ ఆర్ డి ఓ కి వినతిపత్రం అందజేశారు ఇలా అనకాపలి యోజ వర్గంలో భారీగా ఓట్లు తొలగించేలా ఫారం7 కింద చేసిన దరఖాస్తులు చర్చనీయాంశంగా మారింది ఈ పని ఎవరు చేసారు అన్న దానిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలంటూ ఆర్డీవో సూర్యకళ అనకాపల్లి పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు దీనిపై పోలీసులు విచారణ చేపడుతున్నారు


Conclusion:బైట్1 ఆర్సీ శ్రీనివాసరావు, అనకాపల్లి
బైట్2 ఉదయలక్ష్మి 15 వార్డు బి ఎల్ వో
బైట్3 విజయమ్మ, అనకాపల్లి
బైట్4 శ్యాంకుమార్ అనకాపల్లి
బైట్5 పీలా గోవింద సత్యనారాయణ అనకాపల్లి శాసనసభ్యులు
బైట్6 సూర్యకళ అనకాపల్లి ఆర్డీవో
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.