ETV Bharat / state

విశాఖలో నేరాల కట్టడికి పోలీసుల పకడ్బందీ చర్యలు

author img

By

Published : Dec 22, 2020, 4:42 PM IST

నేరాలను అరికట్టేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నామని విశాఖ నగర సీసీఎస్ ఏసీపీ సూర్య శ్రవణ్ కుమార్ అన్నారు. బ్రౌస్ సేఫ్ - బి సేఫ్, సేఫ్ ఆటో, కమ్యూనిటీ బీట్ సిస్టమ్ పేర్లతో నేరాలను అదుపు చేసేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టనున్నట్లు వివరించారు.

Special drive for crime control
పకడ్బందీ చర్యలు

విశాఖ నగరంలో నేరాలను అరికట్టేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నామని సీసీఎస్ ఏసీపీ సూర్య శ్రవణ్ కుమార్ తెలిపారు. సైబర్ నేరాలను అరికట్టేందుకు "బ్రౌస్ సేఫ్ - బి సేఫ్", అసాంఘిక కార్యకలాపాలను నిరోధించేందుకు 'సేఫ్ ఆటో' నినాదంతో ఆటోలతో కమ్యూనిటీ పోలీసింగ్ నిర్వహిస్తామని అన్నారు. మన ఇల్లు మన బాధ్యత పేరుతో "కమ్యూనిటీ బీట్ సిస్టమ్" అమలు చేస్తున్నామని వివరించారు.

ఆటోలకు నైట్ పాస్​లు జారీ..

గత ఐదేళ్లలో ఆటోల ద్వారా నేరాలకు పాల్పడుతున్న వారిని గుర్తించామని, వాటిని అరికట్టేందుకు పకడ్బందీ చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. ఆటోలను సింగిల్ డేటా బేస్ కిందికి తీసుకొస్తామన్నారు. రాత్రివేళల్లో తిరిగే వాటికి నైట్ పాస్​లు జారీ చేస్తామని, అనధికారికంగా తిరిగితే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: 'పేదల కోసం కేటాయించిన ఇళ్లను తరలిస్తారా?'

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.