ETV Bharat / state

Robbery: నిందితులను పట్టించిన ‘రంగు’.. దారి దోపిడీ ముఠా అరెస్ట్‌

author img

By

Published : May 30, 2022, 10:12 AM IST

Robbery: ఊరు వెళ్లడానికి వాహనం కోసం వేచిచూస్తున్న వ్యక్తిని బెదిరించి డబ్బులు లాక్కున్నారు కొందరు యువకులు. అయితే.. తప్పించుకోవాలనుకున్న వారిని.. వారు వాడిన ద్విచక్ర వాహనాలే పట్టించాయి. ఆ వాహనాలకున్న నంబర్​ ప్లేట్లన్లు నిందితులు వంచేయగా.. వాటి రంగుల ఆధారంగా వారిని పట్టుకున్నారు.

student gang arrested for making robbery
నిందితులను పట్టించిన ‘రంగు’.. దారి దోపిడీ ముఠా అరెస్ట్‌

వాహనాల రంగు ఆధారంగా దారి దోపిడి ముఠా అరెస్టు

Robbery: ఊరు వెళ్లడానికి వాహనం కోసం వేచిచూస్తున్న వ్యక్తిని బెదిరించి డబ్బులు లాక్కున్న ఘటన విశాఖ జిల్లాలో జరిగింది. నిందితులను వారు వాడిన వాహనం రంగు ఆధారంగా పోలీసులు గుర్తించి అరెస్టు చేసినట్లు.. ఏడీసీపీ (క్రైమ్‌) గంగాధరం వెల్లడించారు.

ఈ నెల 22వ తేదీ తెల్లవారుజామున 3 గంటల సమయంలో కాలుష్య నియంత్రణ సంస్థలో డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్న రాజారావు.. శ్రీకాకుళం వెళ్లేందుకు ఆర్టీసీ కాంప్లెక్సుకు చేరుకోగా అప్పటికే బస్సులు వెళ్లిపోయాయి. దీంతో బయటకు వచ్చి ఫుట్‌పాత్‌పై నిలిచున్నారు. మూడు వాహనాలపై ఏడుగురు యువకులు అటుగా వచ్చి రాజారావు వద్ద ఆపారు. రూ.500 కావాలని డిమాండ్‌ చేశారు. దీంతో రాజారావు అక్కడ నుంచి వెళ్లిపోవటానికి ప్రయత్నించగా.. కత్తి చూపించి అతని జేబులో ఉన్న రూ.5,500 లాక్కుని అక్కడి నుంచి వాహనాలపై రైల్వేస్టేషన్‌పై వైపు వెళ్లిపోయారు. రాజారావు డయల్‌ 100కు సమాచారం ఇవ్వగా పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు.

యువకులు తిరిగిన ప్రాంతాలను పరిశీలించి, ఆయా మార్గాల్లో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించగా యువకులు వాహనాలపై సుమారు 2 గంటల పాటు పరిసరాల్లోనే తిరిగినట్లుగా గుర్తించారు. వారి వాహనాలకు నెంబరు ప్లేటు ఉన్నా దాన్ని వంచేయటంతో కనిపించలేదు. దీంతో పోలీసులు ఆయా వాహనాల రంగులను పరిశీలించారు. వీటిపై నిఘా పెట్టారు.

అడవివరం దారిలో వాహనాలు తనిఖీ చేస్తుండగా ఈ రంగు వాహనాలపై వస్తున్న యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా నేరం చేసినట్లు అంగీకరించారు. చెడు వ్యసనాలకు అలవాటు పడి డబ్బుల కోసం నేరాన్ని చేసినట్లుగా ఒప్పుకున్నారు. ఈ వాహనాలన్నీ కుటుంబసభ్యులవి కావటం గమనార్హం. వీరి నుంచి రూ.2500 నగదు, మూడు వాహనాలు, ఒక కత్తిని స్వాధీనం చేసుకున్నారు. పి.అభినాష్, ప్రవీణ్‌కుమార్, అశోక్‌కుమార్, ఎల్‌.సతీష్‌లతో పాటు ముగ్గురు బాలలను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో కొందరు ఇటీవలే ఇంటర్మీడియట్ పరీక్షలు రాశారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.