ETV Bharat / state

గణతంత్ర దినోత్సవానికి విశాఖలో సన్నాహాలు

author img

By

Published : Jan 17, 2020, 12:39 PM IST

గణతంత్ర దినోత్సవ వేడుకలకు విశాఖ ఆర్కే బీచ్ సిద్ధమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ వేడుకలను విశాఖలో చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో పరేడ్​కు ప్రభుత్వ విభాగాలకు శిక్షణ ఇస్తున్నారు. నేటినుంచి 25 వరకూ ఉదయం 5.30 నుంచి 11 గంటలు, మధ్యాహ్నం 3నుంచి సాయంత్రం 5గంటల వరకు శిక్షణ కార్యక్రమం జరుగుతుంది. ట్రాఫిక్ నిబంధనలు విధించినట్లు ఏసీపీ చౌదరి పాపారావు తెలిపారు. 26న జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర గవర్నర్, రాష్ట్ర ముఖ్యమంత్రి విచ్చేయనున్నారు.

republic day prepatarions in vishaka
పెరేడ్​కు శిక్షణ పొందుతున్న పోలీసులు

.

పరేడ్​కు శిక్షణ పొందుతున్న పోలీసులు

ఇదీ చూడండిసేవ్ అమరావతి- సేవ్ ఆంధ్రప్రదేశ్'

Ap_Vsp_91_17_Republicday_Reharsals_Av_AP10083 కంట్రిబ్యూటర్: కె.కిరణ్ సెంటర్: విశాఖ సిటీ 8008013325 ( ) ఈనెల 26న గణతంత్ర దినోత్సవాన్ని విశాఖలోని ఆర్కేబీచ్‌లో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో పరేడ్‌కు సిద్ధమయ్యేలా పలు ప్రభుత్వ విభాగాలకు శిక్షణ ప్రారంభమైంది. దీనికోసం ఇవాళ్టి నుంచి 25 వరకు ప్రతీరోజూ ఉదయం 5.30 నుంచి 11 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు శిక్షణ ఇస్తారు. ఈ నేపథ్యంలో బీచ్‌రోడ్డులో ఆయా సమయాల్లో ట్రాఫిక్‌ నిబంధనలు విధించినట్లు ట్రాఫిక్‌ ఏసీపీ చౌదరి పాపారావు తెలిపారు. ప్రజలు పోలీసు వారితో సహకరించాలని కోరారు. ఈ వేడుకలకు రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లు ముఖ్య అతిధులుగా హాజరుకానున్నారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.