ETV Bharat / state

ఈదురు గాలుల బీభత్సం.. స్తంభించిన జనజీవనం

author img

By

Published : May 6, 2021, 8:16 AM IST

విశాఖ జిల్లాలో ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. చెట్లు విరిగిపడి విద్యుత్, ట్రాఫిక్​కు అంతరాయం ఏర్పడింది. భీమునిపట్నం-నర్సీపట్నం రహదారిలో రాకపోకలు నిలిచిపోయాయి. విద్యుత్ శాఖ సిబ్బంది మరమ్మతులు చేస్తున్నారు.

ఈదురు గాలుల బీభత్సం
ఈదురు గాలుల బీభత్సం

విశాఖ జిల్లా రోలుగుంట, రావికమతం ప్రాంతాల్లో బుధవారం సాయంత్రం నుంచి ఈదురు గాలుల బీభత్సం కొనసాగింది. ఈ కారణంగా బాగాపురం, కంచుకమ్ముల, కొవ్వూరు, అడ్డసరం కొంతలం ప్రాంతాల్లో చెట్లు విరిగి విద్యుత్ తీగలపై పడి విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. ఈ కారణంగా పలు ప్రాంతాల్లో అంధకారం నెలకొంది. ట్రాన్స్​కో సిబ్బంది మరమ్మతులు చేపట్టి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. నర్సీపట్నం సమీపంలోని రామచంద్రపురం వద్ద పలు విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. భీమునిపట్నం-నర్సీపట్నం రహదారిలో రోలుగుంట వద్ద చెట్లు విరిగి పడి ట్రాఫిక్​కు అంతరాయం ఏర్పడింది.

ఇదీ చదవండీ... గంగవరం పోర్టులో ప్రభుత్వ వాటా 'అదానీ'కి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.