ETV Bharat / state

పోలీసు జాగిలం 'రూబీ'కి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు

author img

By

Published : Aug 26, 2021, 7:30 PM IST

Updated : Aug 26, 2021, 10:07 PM IST

దశాబ్ద కాలం పోలీసు డిపార్టుమెంటుకు సేవలందించి అనారోగ్యం కారణంగా మృతి చెందిన జాగిలం రూబీకి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ జాగీలం ఎన్నో వీవీఐపీ బందోబస్తు, సమావేశాల్లో విజయవంతంగా సేవలందించింది.

జాగీలం రూబికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు
జాగీలం రూబికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు

పోలీసు జాగిలం 'రూబీ'కి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు

విధి నిర్వహణలో విశేష సేవలందించిన పోలీసు జాగిలం.. రూబీకి విశాఖ జిల్లా పోలీసులు ఘనంగా నివాళులర్పించారు. విశాఖ జిల్లా పోలీసు శాఖకు సుమారు 10 సంవత్సరాలు సేవలు అందించి అనారోగ్యం కారణంగా నిన్న రాత్రి జాగిలం రూబీ మృతి చెందింది. జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు అదేశాల మేరకు ఇవాళ కైలాసగిరి జిల్లా ఆర్మ్​డ్​ రిజర్వ్ మైదానంలో, పోలీసు జాగిలాం..రూబీకి ఆర్మ్​డ్ రిజర్వ్ డీఎస్పీ ఆర్​పీఎల్.శాంతి కుమార్ ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పూలమాలలతో నివాళులర్పించారు. అనంతరం పోలీసు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.

పోలీసు జాగిలం రూబీ మృతి విశాఖపట్నం జిల్లా పోలీసు యంత్రాంగానికి తీరనిలోటని ఏఆర్ డీఎస్పీ శాంతి కుమార్ అన్నారు. రూబీ పోలీస్ కుటుంబ సభ్యులలో ఒకరిగా భావించామని, ‘రూబీ ’ ఎన్నో వీవీఐపి బందోబస్తు, అధికారిక సభలు సమావేశాలలో ఆర్ఓపీ విధుల్లో విజయవంతంగా సేవలు అందించిందని, అనారోగ్యంతో ఆకస్మాత్తుగా మరణించడం చాలా బాధకరమని అన్నారు. రూబీకి ఏఆర్ హెచ్​సీ కృష్ణారావు హ్యాండ్లర్​గా విధులు నిర్వహిస్తున్నాడన్నారు.

లాబ్రాడర్ రీట్రైవర్ జాతికి చెందిన రూబీ 2012 వ సంవత్సరం నుంచి విధులు నిర్వహిస్తోంది. రూబీ ‘ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీ’ హైదరాబాద్​లో పేలుడు పదార్ధాలు కనిపెట్టుటలో ప్రత్యేక శిక్షణ పొందిందన్నారు. శిక్షణ సమయంలో అసాధారణమైన ప్రతిభను కనపరిచి అద్భుతమైన ప్రతిభతో విజయవంతంగా శిక్షణను పూర్తి చేసిందన్నారు. శిక్షణ పూర్తయిన తరువాత 2012 సంవత్సరం నుండి విశాఖపట్నం జిల్లాలో బాంబు డిస్పోజల్ స్క్వాడ్ లో నియమించబడిందన్నారు.

ఇదీ చదవండి: వచ్చే మూడు రోజులు ఆ ప్రాంతాల్లో వర్షాలు

Last Updated : Aug 26, 2021, 10:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.