ETV Bharat / state

పరవాడ సింహాద్రి ఎన్టీపీసీలో.. సౌర విద్యుత్ ప్లాంట్​ ప్రారంభం

author img

By

Published : Aug 21, 2021, 6:29 PM IST

పరవాడ సింహాద్రి ఎన్టీపీసీలో 25 మెగావాట్ల తేలియాడే సౌరవిద్యుత్ ప్లాంట్​ను ఎన్టీపీసీ ప్రాంతీయ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ సంజయ్ మదన్ ప్రారంభించారు. సంస్థకు చెందిన 75 ఎకరాల రిజర్వాయర్​ పై 110 కోట్ల రూపాయలతో ఈ ప్లాంట్ పనులను చేపట్టారు.

పరవాడలో సౌరవిద్యుత్ ప్లాంట్ ప్రారంభం
పరవాడలో సౌరవిద్యుత్ ప్లాంట్ ప్రారంభం

విశాఖ జిల్లా పరవాడ మండలం సింహాద్రి ఎన్టీపీసీలో తేలియాడే సౌర విద్యుత్ ప్లాంట్​ను ఎన్టీపీసీ ప్రాంతీయ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంజయ్ మదన్.. ఉన్నతాధికారులతో కలిసి ప్రారంభించారు. సంస్థకు చెందిన 75 ఎకరాల రిజర్వాయర్​పై.. రూ. 110 కోట్ల రూపాయల వ్యయంతో ఈ విద్యుత్ ప్లాంట్ పనులను చేపట్టారు.

ఇప్పటికే 15 మెగావాట్ల ప్లాంట్ పనులు పూర్తి చేసి గ్రిడ్​కి అనుసంధానం చేశారు. ఇవాళ మిగిలిన 10 మెగావాట్ల పనులు పూర్తి చేశారు. మొత్తం 25 మెగావాట్ల సామర్థ్యంతో ఈ ప్లాంట్ సిద్ధమైంది. మొత్తం పనులు పూర్తి కావడం వల్ల వాణిజ్య డిక్లరేషన్ పూర్తి చేశారు. ఎన్టీపీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మోహిత్ భార్గవ, సింహాద్రి జీజీఎం దివాకర్ కౌశిక్ ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

HAL MARK: హాల్ మార్క్ నిబంధనకు నిరసనగా.. 23న స్వర్ణకారుల సమ్మె

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.