ETV Bharat / state

విశాఖలో ఆరోగ్య సర్వే.. తొలి విడత పూర్తి

author img

By

Published : May 20, 2021, 2:08 PM IST

ఆరోగ్య సర్వే
Health Survey

విశాఖలో మెుదటి విడత ఆరోగ్య సర్వే వేగవంతంగా పూర్తి చేసినట్లు వైద్య సిబ్బంది తెలిపారు. ఈ సర్వే ద్వారా డివిజన్ పరిధిలోని ప్రజల ఆరోగ్య వివరాలు సేకరిస్తున్నామన్నారు.

విశాఖ నగరంలో ఆరోగ్య సర్వే జరుగుతోంది. వివిధ డివిజన్లలో ఆరోగ్య కార్యకర్తలు, ఆశ సిబ్బంది సచివాలయ సిబ్బంది సంయుక్తంగా ఈ సర్వే నిర్వహిస్తున్నారు. ప్రతి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యుల వివరాలు, వారి ఆరోగ్య వివరాలు కనుక్కుంటున్నారు.

ఎవరైనా అనారోగ్యంతో ఉంటే వెంటనే సచివాలయ సిబ్బంది వారికి పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నారు. మొదటి విడత సర్వే వేగవంతంగా పూర్తి చేస్తునట్టు సిబ్బంది చెప్పారు. విశాఖ బాలయ్య శాస్త్రీ లే అవుట్, నక్కవానిపాలెం, సీతమ్మధార, అక్కయ్యపాలెంలో సర్వే చేశారు.

ఇదీ చదవండి:

సిక్కు స్నేహితునికి.. అంత్యక్రియలు చేసిన ముస్లింలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.