ETV Bharat / state

జీవీఎంసీ దర్జా.. 85 శాతం సొంతంగా...!

author img

By

Published : Feb 18, 2021, 6:30 PM IST

విశాఖ నగర పాలక సంస్థ.. తన ఆదాయన్ని పెంచుకుంటూ వెళ్తోంది. 85 శాతం ఆదాయాన్ని సొంతంగా సమకూర్చుకుంటోంది. ఈ దిశగా... ఇప్పుడు ఇంకొన్ని దారులు తెరుచుకుంటున్నాయి.

gvmc
జీవీఎంసీ

పరిపాలన రాజధానిగా విశాఖ అంటూ ప్రభుత్వం నుంచి కీలక ప్రకటన.. ఇంతలోనే ఎన్నికలు.. మరికొన్నిరోజుల్లో కొత్త పాలవర్గం ఏర్పాటు.. ఈ పరిణామాల మధ్య జీవీఎంసీ ఓ రకంగా గాల్లో తేలినట్లే ఉంది. ఆదాయాన్ని పెంచుకునేందుకు ఉవ్విళ్లూరుతూనే ఉంది. అందుకు తగ్గట్లే ప్రణాళికా రూపకల్పన జరుగుతోంది.

విశాఖ స్వరూపం

నగర విస్తరణ - 635 చ.కి.మీ

గృహాలు, ఇతర సముదాయాలు - 5,21,931

నీటి కనెక్షన్లు - 2,55,776 (వీటిలో కొన్ని గృహాలు కలిపి వాడేవి, బల్క్, సెమీ బల్క్‌ కనెక్షన్లూ ఉన్నాయి)

ఎప్పుడెప్పుడు.. ఎంతేసి బడ్జెట్‌..!

2016-17 - రూ.3056కోట్లు

2017-18 - రూ.3,223కోట్లు

2018-19 - రూ.3372.31కోట్లు

2019-20 - రూ.3834.09కోట్లు

2020-21 - రూ.4171.30కోట్లు

2020-21లో కేటాయింపులు ఇలా..

ఇంజినీరింగ్, మౌళికవసతులు - 26శాతం

వివిధ ప్రాజెక్టులు - 16శాతం

భూగర్భమురుగు వ్యవస్థ - 13శాతం

ప్రజారోగ్యం, పారిశుద్ధ్యం - 12శాతం

తాగునీటిసరఫరా - 9శాతం

సాధారణ పద్దు - 5శాతం

విద్యుద్దీపాలు - 3శాతంసుందీరీకరణ,

పార్కులు - 3శాతం

అమృత పథకం - 2శాతం

ఇతర - 11శాతం

15 ఏళ్లలో 50శాతంపైగా..

  • 2007-08లో పాలకవర్గం ఏర్పాటైనప్పుడు జీవీఎంసీ బడ్జెట్‌ రూ.1700కోట్లుండేది. 2021-22 ప్రతిపాదనల ప్రకారం.. రూ.4వేలమించిన నిధులే కేటాయింపులకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టత వస్తోంది.
  • ఉత్తరాంధ్ర జిల్లాల్లో కీలక నగరంగా ఎదిగిన విశాఖ.. 15ఏళ్లలో 50శాతంపైగా ఆదాయాన్ని పెంచుకుంటూ వెళ్లింది. మరో 5ఏళ్లలో రూ.5వేలకోట్లు దాటుతుందనే అంచనాలున్నాయి.
  • తాజా బడ్జెట్‌లో మంచినీటి సరఫరా, పారిశుద్ధ్యం, రహదారులు, కాలువలు, సామాజిక భవనాలు, మురుగునీటి, వర్షపు నీటి కాలువలు వంటి నిర్మాణాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు.

లాభిస్తున్న అంశాలు..

గత కొన్నేళ్లుగా ఆదాయపు పన్నుతో పాటు ఇతర వసూళ్లు భారీగా పెరుగుతున్నాయి. ప్రత్యేకించి ఆదాయపుపన్నులో 90శాతంపైగా వసూళ్లు అవుతున్నాయి. కార్పొరేషన్‌ దీర్ఘకాలికంగా ఎదగడానికి ఇదెంతో దోహదపడుతోంది.

జీవీఎంసీ ఎదిగేకొద్దీ తన సేవల్ని కూడా విస్తృతపరచుకుంటోంది. ఇప్పుడున్న అంచనాల ప్రకారం.. అత్యున్న ప్రమాణాలతో పోల్చితే చాలా సేవల్లో 90శాతం కన్నా ఎక్కువగా అందిస్తోంది.ఆదాయం ఎలా వస్తోందంటే.. జీవీఎంసీకున్న ప్రత్యేకత.. స్వతహాగా ఎక్కువ నిధులు సాధించుకోవడం.

85శాతం నిధులు సొంత ప్రణాళికతోనే వస్తున్నాయి. ఇలా 2020 సెప్టెంబరునాటికి రూ.361కోట్ల మిగులు ఆదాయాన్ని సాధించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఆర్థిక ప్రణాళికకి ఇదో మచ్చుతునక. ఆస్తిపన్ను, ఖాళీ స్థలాల పన్ను నుంచి జీవీఎంసీ ఎక్కువ మొత్తాన్ని ఆర్జిస్తోంది. సుమారు రూ.380కోట్లకు పైగానే ఆదాయానికి లెక్కలు కడుతున్నారు.

నీటి ఛార్జీలు మరో మంచి ఆదాయం. సుమారు రూ.153కోట్లకు పైగా వస్తుంటుంది. వీటికితోడు ప్రణాళిక విభాగం వసూలుచేసే ఫీజులు, భూగర్భ మురుగునీటి కనెక్షన్లు, వాణిజ్య సముదాయాల నుంచి మరో రూ.120కోట్లు వస్తుందని అంచనాలున్నాయి. వీటితో పాటు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల పథకాలకు గ్రాంట్లు, ప్రాజెక్టులకు నిధులు, అడ్వాన్స్‌గా తీసుకునే మొత్తాలు అన్నీ కలిపి రూ.4వేలకోట్లకు తాకేలా నిధులు వస్తుంటాయి.

  • చేసే ఖర్చే ఎక్కువ..వచ్చే ఆదాయం కన్నా

జీవీఎంసీలో ఖర్చుపెట్టే మొత్తమే ప్రతీ ఏటా ఎక్కువగా ఉంటోంది. ప్రతీ ఏటా ఇంజినీరింగ్‌ పనులు, ప్రజారోగ్యం, నీటిసరఫరా తదితరాలకు ఎక్కువ నిధుల్ని కేటాయిస్తూ వస్తున్నారు. కనీసం 5 నుంచి 10శాతం అదనంగా ఖర్చుపెట్టడం కనిపిస్తోంది.

ప్రత్యేకించి మౌళికవసతుల కల్పన, నగర నడిబొడ్డులో కీలక వసతులు, పర్యాటక ఆకర్షణలు, రోడ్లు, కాలువలు తదితరాలపై అత్యధిక నిధుల్ని వెచ్చిస్తుంటారు.మరిన్ని అవకాశాలు..రాష్ట్ర ప్రభుత్వం ఆస్తిపన్ను విధానంలో మార్పులు తెస్తుండటంతో అదనంగా రూ.50కోట్లు పెరగనున్నాయి.

విశాఖను రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా రాజధానిగా ప్రకటించడంతో శివారు ప్రాంతాల్లో నిర్మాణాలు భారీగా పెరుగుతున్నాయి. వీటినుంచి మరో రూ.30కోట్లు పెరగొచ్చు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే.. అదనపు నీటి సరఫరా చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతోంది. తద్వారా మరో రూ.40కోట్లు ఆర్జించవచ్చు.

తాజాగా విలీనమైన పంచాయితీలు, అలాగే అనకాపల్లి, భీమిలి మున్సిపాలిటీల ద్వారా రూ.100కోట్ల ఆదాయం పెరుగుతుందని అంచనాలు వేస్తున్నారు.అయినా కష్టాలున్నాయి..కార్పొరేషన్‌గా ఉన్నప్పుడు 2005లో విలీనమైన 32 పంచాయతీల్లోనే ఇంకా వసతులు మెరుగవలేదు.

వీటికి అదనంగా తాజాగా మరిన్ని పంచాయతీలు వచ్చిచేరాయి. వీటన్నింటిలోనూ మౌళికవసతులు వృద్ధిచేయాల్సి అవసరం ఏర్పడుతోంది. నగర శివారులోని జోన్‌-1, 5, 6లోనూ రోడ్లు, కాలువలు, ఇతర సేవల్ని విస్తరించాల్సిఉంది.

ఇదీ చదవండి:

టెడ్ లేకనే.. అవి చనిపోతున్నాయి..!

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.