ETV Bharat / state

ఉత్తరాంధ్రపై సమీక్ష కోసం - యువతకు ఉద్యోగాలనిచ్చే మిలీనియం టవర్స్‌ కబ్జా! అన్ని శాఖలు విశాఖకు తరలింపు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 24, 2023, 7:49 AM IST

Government Offices in Millennium Towers ఉత్తరాంధ్ర అభివృద్ధిపై సమీక్ష ముసుగులో విశాఖకు రాజధానిని తరలించాలని భావిస్తున్న ప్రభుత్వం.. అక్కడ ప్రభు‌త్వ శాఖలకు భవనాలను కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అయితే, లక్షల మంది యువతకి ఉపాధినిచ్చే మిలీనియం టవర్స్‌తో పాటు రుషికొండ నగరంలోని కొన్ని ప్రాంతాల్లోనే ఈ కార్యాలయాల ఏర్పాటుకు ఆదేశాలు ఇవ్వడమే ఇప్పుడు చర్చాంశనీయమైంది. ఇది హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ దొడ్డిదారిన విశాఖకు రాజధానిని తరలించేందుకు చేస్తున్న ఎత్తుగడే అన్న అరోపణలు వినిపిస్తున్నాయి.

Government_Offices_in_Millennium_Towers
Government_Offices_in_Millennium_Towers

Government Offices in Millennium Towers : వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక విశాఖలో అత్యంత విలువైన భూముల్ని అవకాశం ఉన్న చోటల్లా అధికార పార్టీ ముఖ్య నేతలు, వారి బినామీలు స్వాహా చేసేశారు. దోచుకోవడానికి అవకాశం లేని భూముల్ని ప్రభుత్వం తనఖా పెట్టి సుమారు 25 వేల కోట్ల అప్పులు తెచ్చింది. ప్రభుత్వ విధ్వంసక విధానాలతో ఇప్పటికే HSBC వంటి ఐటీ సంస్థలు విశాఖను వదిలి వెళ్లిపోగా.. మరికొన్ని సంస్థల్ని ప్రభుత్వమే వెళ్లగొట్టింది. అన్నీ వెళ్లిపోయాక ఇంకా ఏం మిగిలిందని.. సీఎం, మంత్రులు విశాఖకు వెళ్లాలనుకుంటున్నారో వారే చెప్పాలి.

AP Government Departments in Visakhapatnam : విశాఖలో ఐటీ రంగం అభివృద్ధిని ప్రోత్సహించేందుకు నిర్మించిన మిలీనియం టవర్స్‌ (Millennium Towers)లో చాలా భాగాన్ని.. రాజధానిని అక్కడికి తరలించే దురుద్దేశంతోనే వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇన్నేళ్లూ ఖాళీగా పెట్టింది. దానిని ఇప్పుడు తమ సమీక్షలకు ఉపయోగించుకునేందుకు వాటి వాడుకునేందుకు ప్రణాళికలు సిద్దం చేసింది. ఐటీ రంగంలో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాల్ని కల్పించే లక్ష్యంతో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో.. మిలీనియం టవర్స్‌ నిర్మాణం తలపెట్టారు. రెండు టవర్లకు అప్పుడే నిధుల కేటాయింపు జరగ్గా... ఒక టవర్‌ నిర్మాణం పూర్తైంది. అందులో నాలుగు అంతస్తుల్ని ఐటీ కంపెనీ కాండ్యుయెంట్‌కు లీజుకిచ్చారు.

CM Camp Office Shifting to Visakhapatnam : వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక రెండో టవర్‌ నిర్మాణం పూర్తి చేసింది. కానీ అప్పటికే రాజధానిని విశాఖకు మార్చాలన్న దురుద్దేశం ఉండటంతో.. మిలీనియం టవర్స్‌ను ఐటీ కంపెనీలకు ఇవ్వకుండా ఖాళీగా ఉంచింది. విస్తరణ కోసం 'టవర్‌-ఎ'లో మిగతా అంతస్తుల్ని తమకివ్వాలని కాండ్యుయెంట్‌ కోరినా ససేమిరా అంది. ఎ, బి టవర్స్‌లో మొత్తంగా 4 లక్షల చదరపు అడుగుల వరకు నిర్మిత ప్రాంతం అందుబాటులో ఉంది. దాన్ని పూర్తి స్థాయిలో ఐటీ కంపెనీలకు కేటాయిస్తే.. మూడు షిఫ్టుల్లో కలిపి 12 వేల మందికి ఉపాధి లభించేదని, అదే బీపీఓ కంపెనీలైతే 24 వేల మందికి ఉపాధి దొరికేదని ఐటీ రంగ నిపుణులు చెబుతున్నారు. వారి వల్ల పరోక్షంగా మరో లక్షమందికైనా ఉపాధి లభించేది. కానీ ఈ టవర్స్‌లోని 1.75 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని ఇప్పుడు ప్రభుత్వం తీసుకోనుంది.

Committee Report is Nominal to Shifting of Administration Activities to Vizag: వైజాగ్‌కు అడ్మినిస్ట్రేషన్ కార్యకలాపాలు..కమిటీ నివేదిక తూతూ మంత్రమే అంటూ విమర్శలు!


కల్లబొల్లి కబుర్లు.. హైకోర్టు ఉత్తర్వుల్ని ధిక్కరించే వైనం : సీఎం జగన్‌ వివిధ ప్రభుత్వ శాఖలపై ఒక నెలలో నిర్వహించే సమీక్షలు పట్టుమని పది కూడా ఉండవు. పైగా ఒకేరోజు రెండు శాఖలపై సమీక్షించిన సందర్భాలు చాలా అరుదు. ఆయన ఒక శాఖపై సమీక్షిస్తుంటే.. దానికి సంబంధించిన మంత్రి, కార్యదర్శి, విభాగాధిపతులు, ఇతర అధికారులు ఓ అయిదారుగురు లేదా మహా అయితే పదిమంది హాజరవుతారు. ఆ మాత్రం దానికి విశాఖలో మొత్తం మంత్రులు, కార్యదర్శులు, విభాగాధిపతులందరికీ క్యాంప్‌ కార్యాలయాలు ఏర్పాటు చేయాల్సిన అవసరమేంటో తెలియని పరిస్థితి. నలుగురైదుగురు సిబ్బందితో నడిచే క్యాంప్‌ కార్యాలయాలకు కొన్ని లక్షల చదరపు అడుగుల నిర్మిత ప్రాంతం కలిగిన భవనాలెందుకో? పైగా సీఎం ఉత్తరాంధ్రలో మకాం పెట్టబోతున్నదీ, మంత్రులు, అధికారులు అక్కడికి వెళ్లబోతున్నదీ.

Millennium Towers in Visakhapatnam : ఉత్తరాంధ్ర అభివృద్ధిని పరుగులు పెట్టించేందుకేనని ప్రభుత్వం చెబుతోంది. అందుకోసం మొత్తం మంత్రులు, కార్యదర్శులు, హెచ్‌ఓడీల కార్యాలయాల్ని విశాఖకు తరలించాల్సిన అవసరమేంటో వారే సెలవివ్వాలి. సీఎం ఏ శాఖపై సమీక్షిస్తే ఆ శాఖ మంత్రి, ఉన్నతాధికారులు, ఉత్తరాంధ్ర జిల్లాల కలెక్టర్లు, స్థానిక అధికారులు హాజరైతే సరిపోతుంది. కానీ ప్రభుత్వం ఉత్తరాంధ్ర అభివృద్ధిపై కల్లబొల్లి కబుర్లు చెబుతూ.. హైకోర్టు ఉత్తర్వుల్ని ధిక్కరించి కుట్రపూరితంగా రాజధానిని విశాఖకు తరలించబోతోందని దీన్నిబట్టి స్పష్టంగా అర్థమవుతోంది.

మిలీనియం టవర్స్‌లో భవనాలు : ఐఏఎస్‌ అధికారులు శ్రీలక్ష్మి, ఎస్‌.ఎస్‌.రావత్, పోలా భాస్కర్‌లతో ఏర్పాటైన కమిటీ.. విశాఖలో మంత్రులు, కార్యదర్శులు విభాగాధిపతుల క్యాంప్‌ కార్యాలయాల ఏర్పాటుకు ఆయా శాఖలకు చెందిన 2లక్షల27వేల287 చదరపు అడుగుల భవనాలు ఇప్పటికే ఉన్నాయని తన నివేదికలో పేర్కొంది. సొంత భవనాల్లేని శాఖలకు మిలీనియం టవర్స్‌లోని లక్ష 75వేల516 చదరపు అడుగుల భవనాల్ని తక్కువ ఖర్చుతో కార్యాలయాల ఏర్పాటుకు అనుకూలంగా సిద్ధం చేయాలని సిఫారసు చేసింది. మంత్రులు, అధికారుల నివాస భవనాలకు.. ఆయా శాఖలకు చెందిన సొంత భవనాల్ని వినియోగించేందుకు తొలి ప్రాధాన్యమివ్వాలని సూచించింది. వీటిని ఆమోదించిన ప్రభుత్వం.. దానికి తగ్గట్టుగా మిలీనియం టవర్స్‌ను సిద్ధం చేయాల్సిందిగా ఐటీ, పరిశ్రమలశాఖకు ఉత్తర్వులు జారీ చేసింది.

తాత్కాలిక ముసుగులో రాజధాని తరలింపు - దొడ్డిదారి జీవో కోర్టు ధిక్కారం కాదా !

రాజధానిని విశాఖకు తరలించేందుకు సన్నాహాలు : ప్రస్తుతం అమరావతి సచివాలయంలో సీఎం కార్యాలయ భవనంలో ఉన్న సాధారణ పరిపాలన, న్యాయశాఖ వంటివాటిని మినహాయిస్తే.. మిగతా ప్రభుత్వ శాఖలన్నీ నాలుగు భవనాల్లో ఉన్నాయి. వాటిలో నిర్మిత ప్రాంతం 4 లక్షల చదరపు అడుగులే. ఇప్పుడు విశాఖలోనూ మొత్తంగా నాలుగు లక్షలకు పైగా చదరపు అడుగుల నిర్మిత ప్రాంతం కలిగిన భవనాల్ని గుర్తించారు. దీన్నిబట్టే రాజధానిని దొడ్డిదారిన విశాఖకు తరలించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని అర్ధమవుతోంది.


జీవోలో క్యాంప్ ఆఫీస్ ప్రస్తావన లేదు : ప్రభుత్వం తాజాగా జారీ చేసిన జీవోలో విశాఖలో సీఎం క్యాంప్‌ కార్యాలయం ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారన్న అంశాన్ని నిర్దిష్టంగా ప్రస్తావించలేదు. ఆ జీవోలో వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించి విశాఖలో అందుబాటులో ఉన్న భవనాలు, వాటి వైశాల్యం తదితర వివరాలను పొందుపరిచారు. అందులో పర్యాటకశాఖకు చెందిన నాలుగు భవనాల గురించి ప్రస్తావించారు.

హరిత రిసార్ట్స్‌లోని 27 గదులు? : మహిళా మండలి ఎదురుగా ఉన్న భవనంలోని మొదటి అంతస్తు, అక్కిరెడ్డిపాలెం షాపింగ్‌ కాంప్లెక్స్, కేవీకే స్టేడియం భవనాలు.. ఆఫీసులకు, హరిత రిసార్ట్స్‌లోని 27 గదులు నివాసానికి ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ఈ 27 గదులు జోడుగుళ్లపాలెంలోని హరిత హోటల్‌లోని గదులా? లేక రుషికొండపై రిసార్టు పేరుతో సీఎం క్యాంప్‌ కార్యాలయం కోసం పర్యాటక శాఖ నిర్వహించిన భవనంలోని గదులా అనే విషయంలో స్పష్టతనివ్వలేదు. రుషికొండపై పర్యాటకశాఖ 433 కోట్లతో నిర్మించిన అత్యంత విలాసవంతమైన భవనాలు సీఎం క్యాంప్‌ కార్యాలయానికి అనుకూలమని ఐఏఎస్‌ల కమిటీ గుర్తించినట్టు ప్రభుత్వం ఇప్పటికే వివిధ ప్రకటనల్లో స్పష్టం చేసింది.

రుషికొండపై భవనాల నిర్మాణానికి రూ 412 కోట్లు ఖర్చు! ఆన్​లైన్ లో జీవోల అప్​లోడ్ తో వెలుగులోకి ఖర్చు వివరాలు

ఉత్తరాంధ్రపై సమీక్ష కోసం - యువతకు ఉద్యోగాలనిచ్చే మిలీనియం టవర్స్‌ కబ్జా!
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.