ETV Bharat / state

ఇంటింటికి కుళాయి కనెక్షన్... జల జీవన్ మిషన్ పథకంతో ప్రజలకు నో టెన్షన్

author img

By

Published : Nov 11, 2020, 12:35 PM IST

గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికి కుళాయి కనెక్షన్ ఇవ్వడం ద్వారా ప్రతి ఒక్కరికి స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే యోచనతో... కేంద్రం జల జీవన్ మిషన్ పథకాన్ని రూపొందించింది. ఈ పథకం విజయవంతం కావాలంటే రాష్ట్ర ప్రభుత్వంతో పాటు స్థానిక ప్రజల భాగస్వామ్యం ఉండాలని కేంద్రం తెలిపింది. అయితే మొత్తం ప్రాజెక్టు అంచనా వ్యయంలో 10% నిధులను స్థానిక సంస్థలు అంటే గ్రామపంచాయతీలు సమకూర్చాల్సి ఉంటుంది. మిగిలిన మొత్తాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయి.

drinking water tap connections are given to rural areas by jal jeevan scheme in vishakapatanam
ఇంటింటికి కుళాయి కనెక్షన్... జల జీవన్ మిషన్ పథకంతో ప్రజలకు నో టెన్షన్

గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికి కుళాయి కనెక్షన్ ఇవ్వడం ద్వారా ప్రతి ఒక్కరికి స్వచ్ఛమైన తాగునీరు అందించాలని కేంద్రం నిర్ణయించింది. ఇందుకోసం కేంద్రం జల జీవన్ మిషన్ పేరుతో ఓ పథకాన్ని రూపొందించింది. 2024 నాటికి గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి రక్షిత సాగునీరు అందించాలన్నది లక్ష్యం. అయితే ఈ పథకం విజయవంతం కావాలంటే రాష్ట్ర ప్రభుత్వంతో పాటు స్థానిక ప్రజల భాగస్వామ్యం ఉండాలని కేంద్రం తెలిపింది.

ప్రతి ఇంటికి తాగునీరు ఏర్పాటు కోసం రూ.5700 కోట్లు అవసరం

మొత్తం ప్రాజెక్టు అంచనా వ్యయంలో 10% నిధులను స్థానిక సంస్థలు అంటే గ్రామపంచాయతీలు సమకూర్చాల్సి ఉంటుంది. మిగిలిన మొత్తాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయి. విశాఖ జిల్లాకు సంబంధించి 433.31 కోట్లతో 3377 గ్రామాల్లో ఈ పనులకు కేంద్రం ఆమోదం తెలిపింది. జల జీవన్ మిషన్ పథకం కింద జిల్లాలో 39 మండలాల్లో ప్రతి ఇంటికి తాగునీరు ఏర్పాటు చేయాలంటే రూ.5700 కోట్లు అవసరం అవుతుందని అధికారులు గతంలో ప్రతిపాదించారు. అయితే ఆ స్థాయిలో నిధులు లేవని దీనిని కుదించే పంపాలని ప్రభుత్వం ఆదేశించింది. అధికారులు కసరత్తు చేసే 2,500 కోట్లకు తగ్గించారు. దీనిపై ప్రభుత్వం పెదవి విరిచింది. చివరకు 433.31 ఒక కోట్లతో 3377 గ్రామాల్లో ప్రతిపాదనలు పంపించగా కేంద్రం తాజాగా ఆమోదం తెలిపింది. ఈ నిధుల్లో 10 శాతాన్ని స్థానిక పంచాయతీలు భరించాల్సి ఉంటుంది. మిగిలిన 90 శాతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం భరిస్తాయి.

అవసరం మేరకు బోర్లు వేస్తారు

విశాఖ జిల్లాకు సంబంధించి 39 మండలాల్లో 4 లక్షల 60 వేల ఇరవై నాలుగు ఇళ్లకు తాగునీటి కుళాయిలు అమరుస్తారు. గ్రామాల్లో ఎప్పటికే ఉన్న నీటి పథకాలను ఇళ్లకు ఉన్న కనెక్షన్లులను పరిగణలోకి తీసుకుని ఇంకా ఏ ఏ పనులు చేయాలి ? అనే కోణంలో ప్రతిపాదిస్తున్నారు. ఒక గ్రామంలో ఇళ్లకు కుళాయి కనెక్షన్ ఇవ్వాలంటే ప్రస్తుతం ఉన్న బోర్లు సరిపోతాయా ? లేదా? అనేది పరిశీలన చేస్తున్నారు. చాలకపోతే ఆ అవసరం మేరకు మరికొన్ని ఏర్పాటు చేస్తారు.

బోర్ల నుంచి ఓవర్ హెడ్ ట్యాంకులు నీటిని పంపింగ్ చేసి వాటి నుంచి పైపులైన్ల ద్వారా ప్రతి ఇంటికి నీటిని అందిస్తారు. ఇప్పటికే ఉన్న ఓవర్హెడ్ ట్యాంకులకు నీటిని పంపింగ్ చేసి వాటి నుంచి పైపులైన్ల ద్వారా ఇళ్లకు సరఫరా చేస్తారు. అంతే తప్ప కొత్తగా ఏమీ నిర్మించరు. చిన్న గ్రామాల్లో 5 లక్షల లోపు ఖర్చుతో ఇంటింటికి కుళాయి కనెక్షన్ ఇవ్వవచ్చు అని అంచనా వేశారు. ఈ మేరకు 1768 గ్రామాల్లో పనులకు ప్రతిపాదించారు. వీటిలో అత్యధికంగా 1610 ఏజెన్సీ గ్రామాలు ఉన్నాయి. మైదానంలో 158 గ్రామాల్లో పనులు ప్రతిపాదించారు. వీటికి 46.62కోట్లు అవసరమని గుర్తించారు. 68077 ఇళ్లలో కొళాయి కనెక్షన్ ఏర్పాటు చేస్తారు.

జల్ జీవన్ మిషాన్ కింద పనులకు టెండర్లు

ఇక 5 లక్షల కంటే ఎక్కువ నిధులతో 1609 గ్రామాల్లో పనులను చేపట్టనున్నారు. 3లక్షల91వేల 947 ఇళ్లకు కుళాయి కనెక్షన్లు ఏర్పాటు చేస్తారు. ఇందుకు 386.69 కోట్లు అవసరమని ప్రతిపాదనలు పంపించారు. జల్ జీవన్ మిషాన్ కింద చేపట్టనున్న పనులకు టెండర్లు, అంశాలపై ఈ నెల రెండవ వారంలో అమరావతిలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నట్లు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు తెలిపారు.

దశల వారీగా నిధులను సమకూర్చవచ్చు

జిల్లాలో 433.31 కోట్లతో పనులు చేపట్టాల్సి ఉండగా... దీనిలో 10 శాతం అంటే 43. 31 కోట్లు పంచాయతీలు సమకూర్చాలి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఇది సాధ్యం కాదనే వాదన వినిపిస్తోంది. అయితే నిధులన్నీ ఒకేసారి కాకుండా దశలవారీగా సమకూర్చే కార్యాచరణ ప్రణాళిక అమలు చేయాలని అధికారులు యోచిస్తున్నారు.

ఇదీ చదవండి:

సీఎంఆర్​ఎఫ్‌ చెక్కుల కుంభకోణంలో నిందితుడు అదృశ్యం!

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.