ETV Bharat / state

cpi ramakrishna: స్టీల్ ప్లాంట్​ ప్రైవేటీకరణపై పవన్ ఎందుకు మాట్లాడటం లేదు..?

author img

By

Published : Oct 10, 2021, 7:16 PM IST

వైకాపా ప్రభుత్వంపై సీపీఐ రామకృష్ణ విమర్శలు గుప్పించారు. జగన్ పాలనలో రాష్ట్రం అన్ని విధాలా దివాళా తీసిందని విమర్శించారు(cpi ramakrishna slams ycp govt). వైజాగా స్టీల్ ప్లాంట్​ను ప్రైవేటీకరిస్తుంటే.. పవన్ కల్యాణ్ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.

cpi ramakrishna
cpi ramakrishna

విశాఖ స్టీల్ ప్లాంట్​ను ప్రైవేటీకరణ చేస్తుంటే పవన్ కల్యాణ్ ఎందుకు మాట్లాడం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు(cpi ramakrishna slams pawan news). విశాఖలో మాట్లాడిన ఆయన.. రైతులను చంపిన భాజపాకి పవన్ ఎలా మద్దతిస్తున్నారని నిలదీశారు. వచ్చే నెల 20 నుంచి సీపీఐ ఆధ్వర్యంలో ప్రజాసమస్యలపై పోరాటానికి సిద్ధమవుతున్నామని చెప్పారు.

రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టడం చాల నీచమైన చర్య అని రామకృష్ణ అభిప్రాయపడ్డారు. జగన్ పాలనలో రాష్ట్రం అన్నివిధాలా దివాళా తీసిందని విమర్శించారు. రాష్ట్ర ప్రజలను జగన్.. దగా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండేళ్ల పాలనలో చేసిన అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అప్పుల కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్లను ప్రవేశపెట్టిన ఘనత కూడా జగన్​కే దక్కుతుందని ఎద్దేవా చేశారు. లఖింపుర్ ఘటనపై స్పందించిన ఆయన.. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు అజిత్ మిశ్రాను ఎందుకు అరెస్ట్ చేయటంలేదని ప్రశ్నించారు. ఈ విషయంలో పోలీసులు ఎందుకు వెనుకంజ వేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి

Minister Kodali Nani: చంద్రబాబు, పవన్ నాటకాలు ప్రజలకు తెలుసు: మంత్రి కొడాలి నాని

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.