ETV Bharat / state

CPI Ramakrishna: అప్పటికి రాష్ట్రం అప్పు రూ.10 లక్షల కోట్లు: రామకృష్ణ

author img

By

Published : May 17, 2022, 5:24 PM IST

అప్పటికి రాష్ట్రం అప్పు రూ. 10 లక్షల కోట్లు
అప్పటికి రాష్ట్రం అప్పు రూ. 10 లక్షల కోట్లు

Ramakrishna Fire On Jagan: సీఎం జగన్ విచ్చలవిడిగా అప్పులు చేస్తూ.. అభివృద్ధిని గాలికొదిలేశారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. జగన్ తన పదవి నుంచి దిగిపోయే నాటికి రాష్ట్రానికి రూ.10 లక్షల కోట్ల అప్పు ఉంటుందని జోస్యం చెప్పారు.

CPI Ramakrishna Fire On YSRCP Govt: ముఖ్యమంత్రి జగన్ తన పదవి నుంచి దిగిపోయే నాటికి రాష్ట్రానికి రూ.10 లక్షల కోట్ల అప్పు ఉంటుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ జోస్యం చెప్పారు. విశాఖ పబ్లిక్ లైబ్రరీలో జరిగిన పార్టీ సమావేశంలో పాల్గొన్న ఆయన.. జగన్ తాను చేసిన అప్పులకు లెక్కలు చెప్పటం లేదని అన్నారు. జగన్ విచ్చలవిడిగా అప్పులు చేస్తూ.. అభివృద్ధిని గాలికొదిలేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఏ ఒక్క రంగంలోనైనా అభివృద్ధి జరుగుతోందా ? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

పోలవరం ప్రాజెక్టును సీఎం జగన్ మూలన పడేశారని.., రాష్ట్రంలో ఏ ప్రాజెక్టునూ పూర్తి చేయలేదని అన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ జరుగుతుంటే.. జగన్ నోరు విప్పటం లేదని అన్నారు. మద్యపాన నిషేదం అమలు చేస్తామని చెప్పి.. పాత బ్రాండ్​లను నిషేదించి, తన బ్రాండ్​ మద్యాన్ని ప్రజల్లోకి వదిలారని విమర్శించారు. మద్యం ద్వారా వచ్చిన ఆదాయం తాడేపల్లికి చేరుతోందని ఆరోపించారు.

ఇవీ చూడండి

ప్రభుత్వాన్ని ఎంతోకాలం నడపలేమని సీఎం జగన్‌కు అర్థమైంది: చంద్రబాబు

CM Jagan: గ్రీన్‌కో ప్రాజెక్టు వల్ల 20 వేల మందికి ఉపాధి: సీఎం జగన్

Fish hunting: చేపల కోసం.. ఓ ఊరి దండయాత్ర

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.