ETV Bharat / state

PROTEST: మత్స్యకార సంఘాల వినూత్న నిరసన...ఎందుకంటే?

author img

By

Published : Jan 3, 2022, 10:29 AM IST

PROTEST: విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవరర్గంలో మత్స్యకార సంఘాల నాయకులు వినూత్న నిరసన చేపట్టారు. మందుల పరిశ్రమ నిబంధనలకు విరుద్దంగా ఏర్పాటు చేస్తున్న పైపులను తొలగించాలని వారు డిమాండ్ చేశారు.

మత్స్యకార సంఘాల వినూత్న నిరసన
మత్స్యకార సంఘాల వినూత్న నిరసన

PROTEST: విశాఖ జిల్లా నక్కపల్లి మండలంలో మత్స్యకార సంఘాల నాయకులు వినూత్న నిరసన చేపట్టారు. గుంతలు తవ్వి అందులో కూర్చోని ఆందోళన చేపట్టారు. రాజయ్యపేట తీరంలో మందుల పరిశ్రమ నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేస్తున్న పైపులను తొలగించాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...పైపులైన్ల ఏర్పాటు విషయంలో నిబంధనలు ఉల్లంఘించిన పరిశ్రమ యాజమాన్యంపై అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. వెంటనే పైపులను తొలగించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని సీపీఎం నాయకులు కోరారు.

ఇదీ చదవండి: ఓర్వకల్లు పారిశ్రామిక నోడ్​కు 3 వేల ఎకరాలే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.