ETV Bharat / state

భూ ఆక్రమణలపై ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయి: విశాఖ జిల్లా కలెక్టర్

author img

By

Published : Aug 28, 2020, 8:34 AM IST

vishaka district collector
vishaka district collector

ఇటీవల కాలంలో ప్రభుత్వ భూముల ఆక్రమణకు సంబంధించి ఫిర్యాదులు ఎక్కువగా అందుతున్నాయని విశాఖ జిల్లా కలెక్టర్ వినయ్​చంద్ వెల్లడించారు. ఆక్రమణదారులపై ఉక్కుపాదం మోపాలని అధికారులను ఆదేశించారు.

భూ ఆక్రమణదారులపై కఠిన చర్యలు చేపట్టాలని అధికారులను విశాఖ జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ ఆదేశించారు. గురువారం రెవెన్యూ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ భూముల పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. ఈ మధ్య కాలంలో భూ ఆక్రమణలకు సంబంధించి ఎక్కువ ఫిర్యాదులు అందుతున్నాయని కలెక్టర్ వెల్లడించారు. గ్రామ స్థాయిలో రెవిన్యూ అధికారులు ప్రభుత్వ భూముల వివరాలను 22ఏలో నమోదు చేయాలన్నారు.

తహసీల్దార్లు సెప్టెంబరు 1 నుంచి 10వ తేదీ వరకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి ప్రభుత్వ భూములు, వాటి ప్రస్తుత స్థితి వివరాలను సేకరించాలని కలెక్టర్ వినయ్ చంద్ ఆదేశించారు. కోర్టు కేసులకు సంబంధించి వెంటనే కౌంటర్లు దాఖలు చేయాలని సూచించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.