ETV Bharat / state

ACHENNAIDU: 'విశాఖ ఉక్కు పరిరక్షణకు.. అఖిలపక్షాన్ని పిలవాల్సిన బాధ్యత సీఎందే'

author img

By

Published : Nov 1, 2021, 5:26 PM IST

వైకాపా రెండున్నరేళ్ల పాలనలో రాష్ట్రం పేరు చెబితే అందరూ అసహ్యించుకుంటున్నారని అచ్చెన్నాయుడు (Achennaidu) విమర్శించారు. విశాఖలోని తెదేపా కార్యాలయంలో రాష్ట్ర అవతరణ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న అచ్చెన్నాయుడు...పొట్టి శ్రీరాములు చిత్రపటానికి నివాళులర్పించారు. ఎక్కడ గంజాయి(cannabis) దొరికినా ...చిరునామా ఆంధ్రప్రదేశ్ అంటున్నారని ఆరోపించారు. విశాఖ ఉక్కు(visakha steel plant) విషయంలో అఖిలపక్షాన్ని పిలవాల్సిన బాధ్యత సీఎందేనని తేల్చి చెప్పారు.

Achennaidu
Achennaidu

విశాఖ జిల్లాలోని తెదేపా కార్యాలయంలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు(Achennaidu) పాల్గొన్నారు. అనంతరం పొట్టి శ్రీరాములు చిత్రపటానికి నివాళులర్పించారు. వైకాపా పాలనలో రెండున్నరేళ్లుగా రాష్ట్రం పేరు చెబితే.. అందరూ అసహ్యించుకుంటున్నారని విమర్శించారు. ఎవరైనా రాష్ట్రాన్ని ఇష్టపడుతున్నారా... పరిశ్రమలు పెట్టడానికి ముందుకు వస్తున్నారా అని ప్రశ్నించారు. వైకాపా పాలనలో రాష్ట్ర పరిస్థితి ఆగమ్య గోచరంగా తయారైందన్నారు. దేశంలో ఎక్కడ గంజాయి(cannabis) దొరికినా అది ఏపీదే అంటున్నారని ఆరోపించారు.

'విశాఖ ఉక్కు విషయంలో అఖిలపక్షాన్ని పిలవాల్సిన బాధ్యత సీఎందే'

గవర్నర్ పేరు పెట్టి అప్పులు తెస్తున్నారని... ఆ విషయంలో గతంలోనే తాము గవర్నర్​కు తెలిపినా స్పందించలేదని అచ్చెన్నాయుడు అన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని..జైల్లో వేస్తున్నారని మండిపడ్డారు. విశాఖ ఉక్కు (visakha steel plant) విషయంలో అఖిల పక్షాన్ని పిలువాల్సిన బాధ్యత సీఎం జగన్​దేనని అచ్చెన్నాయుడు అన్నారు. పొట్టి శ్రీరాములు ఆశయం నేరవేరాలంటే.. వైకాపా పాలనను పారద్రోలాలన్నారు. రాష్ట్రం ఏర్పడటానికి కారణమైన పొట్టి శ్రీరాములును గుర్తు చేసుకోకూదని నేడు వైఎస్ఆర్ అవార్డులను ప్రవేశ పెట్టారని విమర్శించారు.

ఇదీ చదవండి

RRR: అమరావతి రైతుల యాత్ర విజయవంతం కావాలి: ఎంపీ రఘురామ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.