జగన్ పరిపాలనలో ప్రభుత్వ వసతి గృహాల్లో 'సంక్షేమం నిల్ - సంక్షోభం పుల్'
Published: Nov 18, 2023, 7:12 AM


జగన్ పరిపాలనలో ప్రభుత్వ వసతి గృహాల్లో 'సంక్షేమం నిల్ - సంక్షోభం పుల్'
Published: Nov 18, 2023, 7:12 AM

Huge Problems in Government Welfare Hostels : ప్రైవేటు విద్యా సంస్థల్లో చదివించే స్థోమత లేక.. తమ చిన్నారులను తల్లిదండ్రులు ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో చేరుస్తున్నారు. కానీ ఇక్కడ సంక్షేమ వసతి గృహాలు కాస్తా.. సంక్షోభ వసతి గృహాలుగా తయారయ్యాయి. మాట్లాడితే నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ అనే ఊదరగొట్టే సీఎం జగన్.. కనీసం ఆ వర్గాల విద్యార్థుల సమస్యల్ని పట్టించుకున్న పాపాన పోలేదు. తిరుపతిలోని సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులు నిద్రలేక, అపరిశుభ్ర వాతావరణంలోనే అర్ధాకలితో విద్యనభ్యసిస్తున్నారు.
Huge Problems in Government Welfare Hostels : వెనుకబడిన తరగతుల విద్యార్థుల భవిష్యత్తుని నిర్దేశించే ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు సమస్యలకు నిలయంగా మారాయి. కనీస మౌలిక వసతులు లేక విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. విద్యాశాఖ అధికారులు, ప్రభుత్వ నిర్లక్ష్యంతో సంక్షేమ వసతి గృహాలు కాస్తా.. సంక్షోభ గృహాలుగా తయారయ్యాయి. తినే తిండి నుంచి పడుకునే స్థలం వరకు ప్రతిదీ విద్యార్థులకు సమస్యగానే మారింది. సరైన తిండి లేక, కంటికి సరిపడా నిద్రలేక, అపరిశుభ్ర వాతావరణంలోనే అర్ధాకలితో విద్యనభ్యసిస్తున్నారు తిరుపతిలోని సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులు.
Government Hostels Situation Under CM Jagan Ruling : పెచ్చులు వీడిన పైకప్పులు, పరిశుభ్రత లేని మరుగుదొడ్లు, లీకేజీ నీటి పైపులు.. అంతేనా కిటికీలు లేని తలుపులు, పని చేయని ఫ్యానులు, డొక్కు ఇనుప పెట్టెలు.. వీటన్నిటిని చూసి.. ఇదేదో పాడుపడిన భవంతి అనుకుంటే పొరపాటే.. తిరుపతిలోని వెనుకబడిన తరగతుల విద్యార్థులు ఉంటున్న సంక్షేమ వసతి గృహంలోని పరిస్థితి. ప్రయివేటు విద్యా సంస్థల్లో చదివించే స్థోమత లేక.. తమ చిన్నారులను తల్లిదండ్రులు ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో చేరుస్తున్నారు. కానీ ఇక్కడ సంక్షేమ వసతి గృహాలు కాస్తా.. సంక్షోభ వసతి గృహాలుగా తయారయ్యాయి. మాట్లాడితే నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ అనే ఊదరగొట్టే వైసీపీ ప్రభుత్వం.. కనీసం ఆ వర్గాల విద్యార్థుల సమస్యల్ని పట్టించుకున్న పాపాన పోలేదు. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఇక్కడి సమస్యలతో ఓ చిన్నపాటి యుద్ధమే చేస్తున్నారు ఈ విద్యార్థులు.
Government Welfare Hostels Situation in Tirupati : తిరుపతిలోని వెనుకబడిన తరగతుల బాలుర వసతి గృహంలో మూడు నుంచి పదోతరగతి వరకు చదివే విద్యార్థులు వసతి పొందుతున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఉపాధి కోసం తిరుపతి వలస వచ్చిన వారు తమ పిల్లలను వసతి గృహాల్లోనే చేరుస్తున్నారు. 120 మంది ఉన్న ఈ వసతి గృహంలో.. ఆరు గదులు మాత్రమే ఉన్నాయి. దీంతో ఒక్కో గదిలో 20 మంది విద్యార్థులపైనే నిద్రించాల్సిన పరిస్థితి నెలకొంది. వసతి గృహాలు సైతం అపరిశుభ్రంగా ఉండటంతో వాటి మధ్యే విద్యారులు చదువుకోవాల్సిన దుస్థితి తలెత్తింది. సరియైన సదుపాయాలు లేకపోవడంతో విద్యార్ధులు కనీస అవసరాలు తీర్చుకునేందుకు ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
YSRCP Government Negligence on Welfare Hostels : చిత్తూరు జిల్లాలో మొత్తం 57 ఎస్సీ సంక్షేమ వసతి గృహాలు, 38 బీసీ సంక్షేమ వసతి గృహాలు, 7 ఎస్టీ వసతి గృహాలు, 9 గురుకుల పాఠశాలలు ఉన్నాయి. సమీకృత సంక్షేమ బాలుర వసతి గృహాల్లో విద్యార్థులకు సరిపడా మరుగుదొడ్లు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కిటికీలు లేకపోవడంతో వర్షం పడినప్పుడల్లా నీరు గదిలోకి చేరడంతో.. విద్యార్థులు రాత్రంతా జాగారం చేయాల్సిన పరిస్థితి. ప్రభుత్వం స్పందించి మంచాలు అందజేయాలని విద్యార్థులు కోరుతున్నారు.
