ETV Bharat / state

మాజీమంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కన్నుమూత

author img

By

Published : May 6, 2022, 3:54 PM IST

Updated : May 6, 2022, 10:25 PM IST

మాజీమంత్రి బొజ్జల
మాజీమంత్రి బొజ్జల

18:53 May 06

మాజీమంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కన్నుమూత.. ప్రముఖుల సంతాపం

బొజ్జల గోపాల కృష్ణారెడ్డితో చంద్రబాబు
బొజ్జల గోపాల కృష్ణారెడ్డితో చంద్రబాబు

మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి(73) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బొజ్జల.. హైదరాబాద్ అపోలోలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అపోలో ఆస్పత్రి నుంచి బొజ్జల భౌతికకాయాన్ని జూబ్లీహిల్స్ నివాసానికి కుటుంబ సభ్యుల తరలించారు. రాత్రి లేదా రేపు ఉదయం స్వగ్రామానికి బొజ్జల పార్థివదేహం తరలించనున్నారు. కార్యకర్తల సందర్శన కోసం ఊరందూరులో బొజ్జల భౌతికకాయం ఉంచనున్నారు. అనంతరం ఎల్లుండి బొజ్జల అంత్యక్రియలు నిర్వహించునున్నారు.

తిరుపతి జిల్లా శ్రీకాశహస్తి నియోజకవర్గం ఊరందూరు గ్రామంలో 1949 ఏప్రిల్ 15న బొజ్జల జన్మించారు. శ్రీకాళహస్తి నుంచి 1989లో తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం 1994,1999,2009,2014 వరుసగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1994 ,2004 మధ్య ఐటీ, రోడ్లు-భవనాల శాఖా మంత్రిగా పనిచేశారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు.

2014లో ఎన్నికల్లో శ్రీకాళహస్తి నుంచి గెలుపొందిన బొజ్జల 2014-19 కాలంలోనూ మధ్య మంత్రిగా పనిచేశారు. అలిపిరి బాంబు పేలుడు ఘటనలో చంద్రబాబుతో పాటు బొజ్జల కూడా ఉన్నారు. చిత్తూరు జిల్లా రాజకీయాల్లో బొజ్జల-గాలి ముద్దు కృష్ణమనాయుడిది మంచి జోడిగా పేరొందారు. 2004-2014 మధ్య తెదేపా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బొజ్జల-గాలి ముద్దు కృష్ణమనాయుడుని "చిత్తూరు బ్రదర్స్" అంటూ పార్టీ నేతలు ఆత్మీయంగా పలకరించేవారు. బొజ్జలకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, తుమ్మల నాగేశ్వరరావు, మండవ వెంకటేశ్వరరావు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆప్తమిత్రులు.

15:51 May 06

హైదరాబాద్‌లోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస

బొజ్జల గోపాల కృష్ణారెడ్డితో చంద్రబాబు
బొజ్జల గోపాల కృష్ణారెడ్డితో సీఎం కేసీఆర్​
బొజ్జల గోపాల కృష్ణారెడ్డితో సీఎం కేసీఆర్​

ప్రముఖుల సంతాపం: బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మరణం అత్యంత బాధాకరమని చంద్రబాబు విచారం వ్యకం చేశారు. లాయర్‌గా జీవితం ప్రారంభించి ఎన్టీఆర్ పిలుపుతో తెదేపాలో చేరారని..శ్రీకాళహస్తి ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండేవారని చంద్రబాబు కొనియాడారు. బొజ్జల ఆత్మకు శాంతి కలగాలి, కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆప్త మిత్రుడు, రాజనీతిజ్ఞుడు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మృతి బాధాకరమని జాతీయ ప్రధానకార్యదర్శి నారాలోకేశ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పార్టీ తీసుకున్న ఎన్నో కీలక నిర్ణయాల్లో విలువైన సలహాలు ఇచ్చిన వ్యూహకర్త బొజ్జల అని కొనియాడారు. ఎమ్మెల్యేగా ఐదుసార్లు, మంత్రిగా నిత్యం ప్రజల శ్రేయస్సు కోసం పరితపించే వారని లోకేశ్ గుర్తుచేసుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని, కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి మృతి పట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, గవర్నర్ బిశ్వభూషణ్‌, ముఖ్యమంత్రి జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్, కేటీఆర్, బాలకృష్ణ, సోమిరెడ్డి, సోము వీర్రాజు, కె.నారాయణ, మాగంటి గోపీనాథ్ , ఎమ్మెల్యే కరణం బలరామ్ సంతాపం తెలిపారు. కుటుంబసభ్యులకు భగవంతుడు మనోధైర్యం ఇవ్వాలని ప్రార్థించారు. ఆత్మీయ మిత్రుడిని కోల్పోయానంటూ కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు. ఇటీవల ఇంటికి వెళ్లి బొజ్జలను కేసీఆర్‌ పరామర్శించిన విషయం తెలిసిందే.

ఇదీ చదవండి: రాష్ట్రాన్ని రక్షించుకునేందుకు.. మరో ప్రజాఉద్యమం : చంద్రబాబు

Last Updated : May 6, 2022, 10:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.