ETV Bharat / state

Speaker Tammineni : కబడ్డీ ఆడుతూ.. పడిపోయిన సభాపతి

author img

By

Published : Dec 23, 2021, 5:25 PM IST

Speaker Tammineni : క్రీడాకారులను ఉత్సాహపరిచేందుకు సభాపతి తమ్మినేని సీతారాం కబడ్డీ ఆడారు. అయితే.. ఆట ఆడే క్రమంలో అదుపు తప్పడంతో.. కింద పడిపోయారు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస జూనియర్ కళాశాల మైదానంలో జరిగింది.

Speaker Tammineni Fell down
కబడ్డీ ఆట ఆడుతూ.. ఒక్కసారిగా అదుపుతప్పి పడిపోయిన సభాపతి...

కబడ్డీ ఆట ఆడుతూ.. ఒక్కసారిగా అదుపుతప్పి పడిపోయిన సభాపతి...

Speaker Tammineni Fell down : శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస జూనియర్ కళాశాల మైదానంలో "సీఎం కప్" నియోజకవర్గ స్థాయి క్రీడలను సభాపతి తమ్మినేని సీతారాం ప్రారంభించారు.

క్రీడాకారులను ఉత్సాహంగా పరిచేందుకు సభాపతి.. క్రికెట్​తోపాటు కబడ్డీ పోటీల్లోనూ పాల్గొన్నారు. అయితే.. కబడ్డీ ఆడుతుండగా ఒక్కసారిగా అదుపు తప్పడంతో మైదానంలో కింద పడిపోయారు. అందరూ అప్రమత్తమై వెంటనే పైకి లేపారు.

ఇదీ చదవండి : Srilanka PM Tirumala Visit : శ్రీవారి దర్శనానికి తరలి వచ్చిన శ్రీలంక ప్రధాని

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.