ETV Bharat / state

"వైఎస్‌ఆర్‌ బీమా"పై వాలంటీర్ ఆవేదన.. మౌనం వహించిన మంత్రి!

author img

By

Published : May 23, 2022, 4:23 PM IST

వైఎస్‌ఆర్‌ బీమా పథకాన్ని కుటుంబంలో ఒక్కరికే వర్తింపజేయడం వల్ల చాలా మంది నష్టపోతున్నారని మంత్రి ధర్మాన ఎదుట ఓ వాలంటీర్​ ఆవేదన వ్యక్తం చేశారు. పథకాన్ని సరిగ్గా అమలు చేయడంలేదంటూ వాలంటీర్​ అన్న మాటలకు మంత్రి మౌనం వహించారు.

Volunteer
వైఎస్‌ఆర్‌ భీమా పథకం అమలుపై వాలంటీర్

వైఎస్‌ఆర్‌ భీమా పథకాన్ని కుటుంబంలోని ఒక వ్యక్తికే అమలుచేయడం వల్ల తీవ్ర నష్టం కలుగుతోందని ఓ వాలంటీర్‌ మంత్రి ధర్మాన ప్రసాదరావు దృష్టికి తీసుకెళ్లారు. శ్రీకాకుళం గ్రామీణ మండలం తండేంవలస సచివాలయంలో అధికారులు, వాలంటీర్లతో మంత్రి ధర్మాన సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ పథకాల తీరుపై వాలంటీర్లను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో వైఎస్‌ఆర్‌ భీమా పథకం అమలు సరిగాలేదంటూ మంత్రికి ఎర్రన్నాయుడు అనే వాలంటీరు వివరించారు. ఒక కుటుంబంలో ఒకరికే అమలు వల్ల చాలా కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని తెలిపారు. వాలంటీర్‌ మాటలకు సమాధానం చెప్పలేక.. మంత్రి మౌనంగా ఉండిపోయారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.