ETV Bharat / state

'ఎప్పుడు ఎన్నికలు వచ్చినా.. వైకాపాదే విజయం'

author img

By

Published : Jun 24, 2022, 7:41 PM IST

YSRCP Leaders Comments on Atchennaidu: ఎప్పుడు ఎన్నికలు వచ్చినా.. వైకాపాదే విజయమని మాజీ ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ ఉద్ఘాటించారు. శ్రీకాకుళం జిల్లాలో తిత్లీ తుపాను అదనపు పరిహారం కింద రూ. 182 కోట్ల చెక్కును రైతులకు మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజుతో కలిసి అందజేశారు.

Titli cyclone additional Compensation
Titli cyclone additional Compensation

Titli cyclone additional Compensation Check distributed: 'వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి 160 సీట్లు వస్తాయని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చెప్తున్నారు... 23 సీట్లు వచ్చిన తెదేపాకు 160 వస్తే.. 151 సీట్లు వచ్చిన వైకాపాకు ఎన్ని సీట్లు రావాలి' అని మాజీ ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ ఎద్దేవా చేశారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా.. వైకాపాదే విజయమని ఆయన ఉద్ఘాటించారు. శ్రీకాకుళం జిల్లాలో తిత్లీ తుపాను అదనపు పరిహారాన్ని బాధితు రైతులకు మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు అందజేశారు.

జిల్లాలోని పలాస మండలం బొడ్డపాడులో తీత్లీ తుపాను కారణంగా నష్టపోయిన కొబ్బరి, జీడి మామిడి రైతులకు అదనపు పరిహారం కింద రూ. 182 కోట్ల చెక్​ను మంత్రులు అందజేశారు. దేశంలో సీఎం జగనే పెద్ద కమ్యూనిస్ట్ అన్న మంత్రులు.. వైకాపాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని మంత్రులు ధర్మాన, సీదిరి అప్పలరాజు అన్నారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.