ETV Bharat / state

'నేర చరిత్ర ఉన్నవాళ్లు.. నన్ను విమర్శించడమేంటి?'

author img

By

Published : Aug 31, 2019, 4:33 PM IST

తమ్మినేని

కక్షపూరితంగా కూన రవికుమార్​పై కేసులు బనాయిస్తున్నారన్న తెదేపా నేతల ఆరోపణలపై స్పీకర్​ తమ్మినేని సీతారాం ధ్వజమెత్తారు. నేర చరిత్ర బయటకు తీస్తే ఎవరు.. ఎలాంటి వారో అర్థమవుతుందని చెప్పారు.

మీడియాతో సభాపతి

తెదేపా నేత కూన రవికుమార్​పై కేసులకు తనకు ఎలాంటి సంబంధం లేదని శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం స్పష్టం చేశారు. ఆయన కుటుంబంపై వస్తున్న ఆరోపణలపై సభాపతి స్పందించారు. శ్రీకాకుళంలో ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన... అనంతరం మీడియాతో మాట్లాడారు. ఉద్యోగులను బెదిరించినందుకే రవికుమార్​పై కేసులు నమోదయ్యాయని అన్నారు. తనపై, తన కుటుంబంపైనా లేనిపోని ఆరోపణలు చేయటం మానుకోవాలని హెచ్చరించారు. జిల్లాలో అచ్చెన్నాయుడు, కూన రవికుమార్​తో పాటు మరి కొంతమంది తెదేపా నాయకులకు ఉన్న క్రిమినల్ ట్రాక్ ఇంకెవరికీ లేదని ఆరోపించారు. జిల్లాలోని నాయకులపై క్రిమినల్ టాక్ బయటకు తీస్తే ఎవరు ఎలాంటి వారో అర్థమవుతుంది అన్నారు. మూడు నెలలు అధికారం లేకపోతే ఇలా చిందులేయడం తగదని ఆయన విమర్శించారు.

"తెదేపా నేతల ఆరోపణలపై మీరేమంటారు" అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వాటికి తనకు ఏంటి సంబంధం అని ప్రశ్నించారు... చెప్పకపోతే ఇక్కడ నుంచి కదలనీయనని అన్నారు. అనంతరం వారి ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. బాధ్యతగా వ్యవహరించండి అని వారికి సూచించారు.

ఇవీ చదవండి

అర్ధరాత్రి...కూన రవికుమార్ ఇంట్లో పోలీసుల సోదాలు

ప్రభుత్వ మాజీ విప్‌ కూన రవికుమార్‌పై కేసు నమోదు

తప్పుడు కేసులు పెడితే పోరాడతాం: అచ్చెన్నాయుడు

Intro:ap_atp_51_31_uri_vesukoni_athmahatya_av_ap10094


Body:అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం చెన్నేకొత్తపల్లి జాతీయ రహదారి పక్కన ఉన్న బెల్లపు కొండ దగ్గర చెట్టుకు ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్య.

విషయం తెలుసుకున్న చెన్నేకొత్తపల్లి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఉరి వేసుకున్న వ్యక్తి జోబులో అతడి బ్యాంకు సంబంధించిన పాసుబుక్ ఉండడంతో మృతుడు పామి శెట్టి గోవర్ధన్(29)సం మృతుడు హిందూపురం నియోజవర్గం ముదిరెడ్డిపల్లి గ్రామస్థుడు గా గుర్తించారు.




Conclusion:R.Ganesh
RPD(ATP)
cell:9440130913
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.