ETV Bharat / state

'క్వారంటైన్ కేంద్రాలలో పౌష్టికాహారం అందించండి'

author img

By

Published : Jun 10, 2020, 1:18 PM IST

క్వారంటైన్ కేంద్రాలలో ఉన్నవారికి పౌష్టికాహారం అందించటంతో పాటు పరిసర ప్రాంతాలన్నీ పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలని... శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జె. నివాస్ అధికారులను ఆదేశించారు.

srikakulam collector visits quarantine centres
లక్ష్మీపురంలో క్వారంటైన్ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం లక్ష్మీపురంలో ఈస్ట్ కోస్ట్ పవర్ ప్లాంట్, హుద్ హుద్ భవనాలలో ఏర్పాటుచేసిన క్వారంటైన్ కేంద్రాలను కలెక్టర్ జె.నివాస్ పరిశీలించారు. ఆయా కేంద్రాలలో ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా నిర్వహించాలని... పాజిటివ్ కేసులు నమోదైతే మరింత జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈస్ట్ కోస్ట్ పవర్ ప్లాంట్​లో ఉన్న 19 బ్లాకులు, హుద్ హుద్ భవనాలలో ఉన్న 11 బ్లాకులపై ఆరా తీశారు. ఇటీవల ఫలక్ నుమా ఎక్స్​ప్రెస్ రైలులో వచ్చిన వలస కార్మికులతో మాట్లాడారు. వారికి అందుతున్న సేవలు, పౌష్టికాహారంపై అడిగి తెలుసుకున్నారు. క్వారంటైన్​లో ఉన్న వారిపై వివక్ష చూపరాదని సూచించారు. క్వారంటైన్​లో ఉన్నవారు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని... భౌతిక దూరం పాటించాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చూడండి: రేషన్​ కందిపప్పు తూకంలో అవకతవకలు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.