ETV Bharat / state

దేశంలో ఎక్కడా లేని విధంగా బీమా పథకం: తమ్మినేని

author img

By

Published : Dec 15, 2020, 8:12 PM IST

దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి వైఎస్‌ఆర్‌ ఉచిత పంటల బీమా పథకానికి రూపకల్పన చేశారని సభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. బీమా ప్రీమియం రైతుల తరఫున ప్రభుత్వం చెల్లింపు చేస్తుందని వెల్లడించారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా బీమా పథకం: తమ్మినేని
దేశంలో ఎక్కడా లేని విధంగా బీమా పథకం: తమ్మినేని

సీఎం జగన్ ప్రారంభించిన వైఎస్‌ఆర్‌ ఉచిత పంటల బీమా కార్యక్రమంలో.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శ్రీకాకుళం కలెక్టర్‌ కార్యాలయం నుంచి సభాపతి తమ్మినేని సీతారాం, ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, మంత్రి సీదిరి అప్పలరాజు, కలెక్టర్‌ నివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

బీమా ప్రీమియం రైతుల తరఫున ప్రభుత్వం చెల్లిస్తుందని సభాపతి చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుతం 69 లక్షల 80 వేల మంది రైతులకు చెందిన 45 లక్షల 96 వేల హెక్టార్ల పంటను బీమా చేయడం జరిగిందన్నారు. రాష్ట్రంలో నెలకొల్పిన రైతు భరోసా కేంద్రాలు వలన పూర్తి పారదర్శకత వచ్చిందన్నారు. రైతు భరోసా కేంద్రాలు వద్ద ఈ-క్రాప్ వివరాలతో సహా లబ్ధి పొందిన రైతుల జాబితా ప్రదర్శించడం జరుగుతుందన్నారు. శ్రీకాకుళం జిల్లాలో 10 వేల మంది రైతులకు రూ.3 కోట్ల 20 వేలు చెల్లింపులు చేయడం జరిగిందని సభాపతి తమ్మినేని సీతారాం తెలిపారు.

ఇదీ చదవండి: 'మూడు రాజధానుల నిర్ణయం ఉపసంహరించుకునే వరకు పోరాటం ఆగదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.