ETV Bharat / state

శ్రీకాకుళంలో 'ఫ్యామిలీ డాక్టర్' ప్రారంభం.. స్పీకర్ తమ్మినేని ఏమన్నారంటే..!

author img

By

Published : Apr 6, 2023, 6:39 PM IST

Tammineni Sitaram Started The Family Doctor Program: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. శ్రీకాకుళం జిల్లాలో స్పీకర్ తమ్మినేని సీతారాం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

Etv Bharat
Etv Bharat

Tammineni Sitaram Started The Family Doctor Program : ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం ద్వారా గడప వద్దకే వైద్య సేవలు అందించనున్నామని ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం కలుగులవలస గ్రామంలో గురువారం స్పీకర్ తమ్మినేని సీతారాం చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభించారు.

గడప గడపకు వైద్య సేవలు : ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలంలో ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం ప్రారంభించారన్నారు. ఒక నెలలో ఓ గ్రామ పరిధిలో రెండు పర్యాయాలు వైద్యులు సందర్శించి ప్రతి గడపకు వైద్య సేవలు అందిస్తారని ఆయన అన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా ట్రైల్ రన్ విజయవంతం : వైయస్సార్ హెల్త్ క్లినిక్ లో 14 రకాల టెస్టులు, 105 రకాల మందులు అందుబాటులో ఉంటాయని స్పీకర్ అన్నారు. ఈ కార్యక్రమం కోసం ఈ నాలుగు సంవత్సరాలలో 49 వేల వైద్య సిబ్బంది నియమించారన్నారు. గ్రామాలలో నివసిస్తున్న ప్రజల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం బాధ్యత తీసుకుందని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రజల ఆరోగ్యం పట్ల ముఖ్యమంత్రి చిత్తశుద్దితో పని చేస్తున్నారని శాసన సభాపతి అన్నారు. గత సంవత్సరం అక్టోబర్ 21 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ట్రయల్ రన్ విజయవంతమైందని తెలిపారు.

ప్రతి 2000 జనాభాకు ఒక ఆరోగ్య కేంద్రం : శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ శ్రీకేష్ మాట్లాడుతూ కరోనా కాలం నుండి మనం చాలా పాఠాలు నేర్చుకున్నామని దాని పర్యవసనమే ఈరోజు ప్రతి 2000 జనాభాకు ఒక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేసి, వైద్య సిబ్బందిని నియమించి ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం ద్వారా రాష్ట్ర ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నారనీ ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో డీఎం, హెచ్ఓ బొడ్డేపల్లి మీనాక్షి, రాష్ట్ర యువజన విభాగ ప్రధాన కార్యదర్శి తమ్మినేని చిరంజీవి నాగ్, ఎంపీపీ తమ్మినేని శ్రీరామ్ మూర్తి, జడ్పిటిసి బెండి గోవింద రావు, పీఎసీఎస్ అధ్యక్షులు గురుగుబెల్లి శ్రీనివాస రావు, వైస్ ఎంపీపీ మానుకొండ వెంకట రమణ, స్థానిక నాయకులుడి సీసీబీ డైరెక్టర్ బొడ్డేపల్లి నారాయణరావు, మండల సచివాలయాల కోఆర్డినేటర్ నిరంజన్ బాబు, తదితర వైయస్సార్ పార్టీ సర్పంచులు ఎంపీటీసీ నాయకులు కార్యకర్తలు, అధికారులు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.